ATM: SBI ఖాతాదారులకు అలర్ట్‌.. ఇకపై ఏటీఎమ్‌ నుంచి డబ్బులు తీయాలంటే, ఇది పాటించాల్సిందే..

ఎన్ని రకాల పటిష్ట చర్యలు చేపట్టినా ఆర్థిక సంబంధిత నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఆన్‌లైన్‌ లావాదేవీలను టార్గెట్‌ చేస్తూ కొందరు సైబర్‌ నేరగాళ్లు ఖాతాల్లోని డబ్బులను కొట్టేయడం తెలిసిందే. అయితే కేటుగాళ్లు రూటు మార్చారు...

ATM: SBI ఖాతాదారులకు అలర్ట్‌.. ఇకపై ఏటీఎమ్‌ నుంచి డబ్బులు తీయాలంటే, ఇది పాటించాల్సిందే..
Sbi Atm New Rule
Narender Vaitla

|

Oct 04, 2022 | 11:34 AM

ఎన్ని రకాల పటిష్ట చర్యలు చేపట్టినా ఆర్థిక సంబంధిత నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఆన్‌లైన్‌ లావాదేవీలను టార్గెట్‌ చేస్తూ కొందరు సైబర్‌ నేరగాళ్లు ఖాతాల్లోని డబ్బులను కొట్టేయడం తెలిసిందే. అయితే కేటుగాళ్లు రూటు మార్చారు. ఏటీఎమ్‌లలో నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఏటీఎమ్‌ సెంటర్లలో కార్డ్‌ వివరాలను కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దేశీయ దిగ్గజ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఖాతాదారులు నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండేదుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై ఏటీఎమ్‌లో డబ్బులు విత్‌డ్రా చేయాలనుకునే వారు కచ్చితంగా ఏటీఎమ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఏటీఎమ్‌లో డబ్బులు తీసుకునే సమయంలో ఏటీఎమ్‌ పిన్‌తో పాటు ఫోన్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూ. 10 వేలకు పైగా విత్‌డ్రా చేయాలనుకునే వారు కచ్చితంగా ఓటీపీ ఎంటర్‌ చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది.

స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌..

ఏటీఎమ్‌లో కార్డును ఇన్‌సెర్ట్‌ చేసి అమౌంట్‌ను ఎంటర్‌ చేయాలి. అనంతరం కార్డు పిన్‌ ఎంటర్‌ చేయగానే డిస్‌ప్లే పై ఓటీపీని ఎంటర్‌ చేయమని మెసేజ్‌ వస్తుంది. ఫోన్‌కి వచ్చిన సదరు ఓటీపీ ఎంటర్‌ చేస్తే డబ్బులు విత్‌డ్రా అవుతాయి. ఈ నిర్ణయంతో నకిలీ కార్డులను సృష్టించి డబ్బులు కాజేసే వారికి చెక్‌ పడుతుందని ఎస్‌బీఐ భావిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu