వరుసగా తొమ్మిదో సారి తగ్గింపు.. మరింత చౌకగా ఎస్‌బీఐ లోన్స్..!

ప్రభుత్వరంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిత్యం ఏదో ఆఫర్లతో.. కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. గతకొద్ది రోజులుగా వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ కస్టమర్లకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. తాజాగా తొమ్మిదోసారి వడ్డీరేట్లను (ఎంసీఎల్‌ఆర్‌) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.90గా ఉంది. తాజాగా తొమ్మిదోసారి తగ్గింపుతో.. ఇది 7.85కు చేరింది. ఈ తగ్గిన ధరలు.. ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త నిర్ణయంతో […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:01 pm, Fri, 7 February 20
వరుసగా తొమ్మిదో సారి తగ్గింపు.. మరింత చౌకగా ఎస్‌బీఐ లోన్స్..!

ప్రభుత్వరంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిత్యం ఏదో ఆఫర్లతో.. కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. గతకొద్ది రోజులుగా వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ కస్టమర్లకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. తాజాగా తొమ్మిదోసారి వడ్డీరేట్లను (ఎంసీఎల్‌ఆర్‌) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.90గా ఉంది. తాజాగా తొమ్మిదోసారి తగ్గింపుతో.. ఇది 7.85కు చేరింది. ఈ తగ్గిన ధరలు.. ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. ఈ కొత్త నిర్ణయంతో హౌసింగ్ లోన్లు, వెహికిల్ లోన్లు మరింత చౌకగా లభించనున్నాయి.

మరోవైపు టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీ రేట్లను కూడా తగ్గించాలని డిసైడ్ అయ్యింది. అయితే ఈ తగ్గింపు 10-50 బేసిస్‌ పాయింట్ల వరకు ఉండబోతుందని తెలుస్తోంది. ఈ తగ్గింపు ధరలు కూడా ఫిబ్రవరి 10 తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఎస్బీఐ లోన్ల శాతం పెరిగిందని.. ప్రస్తుతం 6.8శాతం పెరిగాయని ఒక ప్రకటనలో పేర్కొంది. గతేడాది డిసెంబర్‌ ముగిసేనాటికి రూ.23,01,669 కోట్లకు చేరినట్లు ప్రకటించింది. ముఖ్యంగా పర్సనల్ లోన్లు 17.49శాతం పెరిగాయని తెలిపింది.