RBI: యాక్సిస్‌ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా .. భారీగా జరిమానా.. ఎందుకంటే..!

RBI: యాక్సిస్‌ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా .. భారీగా జరిమానా.. ఎందుకంటే..!

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. అంతేకాదు పలు బ్యాంకుల లైసెన్స్‌లను..

Subhash Goud

|

Apr 09, 2022 | 12:14 PM

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. అంతేకాదు పలు బ్యాంకుల లైసెన్స్‌లను సైతం రద్దు చేస్తోంది ఆర్బీఐ. ఇక తాజాగా యాక్సిస్ బ్యాంక్, IDBI బ్యాంక్ వేర్వేరు నిబంధనలను పాటించనందుకు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ శుక్రవారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో కనీస నిల్వను నిర్వహించనందుకు విధించాల్సిన ఛార్జీలు, మోసాల నుండి రక్షణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలకు సంబంధించిన KYC మార్గదర్శకాలు, నిబంధనలను నెరవేర్చనందుకు బ్యాంకులకు జరిమానా విధించబడింది. యాక్సిస్ బ్యాంక్‌పై రూ.93 లక్షలు, ఐడీబీఐ బ్యాంక్‌పై రూ.90 లక్షలు జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది.

రిజర్వ్ బ్యాంక్ వివరాల ప్రకారం.. RBI జారీ చేసిన కొన్ని సూచనలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్ రూ. 93 లక్షల జరిమానా విధించింది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బ్యాంక్ రుణాలు, అడ్వాన్సులపై కొన్ని నిబంధనలను ఉల్లంఘించింది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించనందుకు జరిమానా ఛార్జీల విధింపుకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను పాటించలేదు. అలాగే కేవైసీ (KYC) మార్గదర్శకాలు పాటించనందున ఈ చర్యలు చేపట్టింది ఆర్బీఐ. IDBI బ్యాంక్ వర్గీకరణ, మోసాల రిపోర్టింగ్ సూచనలను పాటించనందుకు జరిమానా విధించబడింది. అలాగే సైబర్ భద్రతకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినందుకు IDBI బ్యాంక్‌కి కూడా జరిమానా విధించబడింది.

ఇవి కూడా చదవండి:

RBI: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ.. GDP వృద్ధి 7.2 శాతంగా అంచనా..

TRAI USSD Charges: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఆ ఛార్జీలను ఎత్తివేసిన ట్రాయ్‌..!

Book Now Pay Later: ఇప్పుడే బుక్‌ చేయండి.. డబ్బులు తర్వాత చెల్లించండి.. పేటీఎం సరికొత్త సేవలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu