రెపో రేటు 25 పాయింట్లు తగ్గింది.. మరి మీ లోన్‌ EMI ఎంత తగ్గుతుంది? పొదుపుపై వడ్డీ కూడా తగ్గుతుందా?

ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో అది 5.25 శాతానికి చేరింది. ఇది గృహ, వాహన, వ్యక్తిగత రుణ EMIలను తగ్గిస్తుంది, సామాన్యులకు ప్రయోజనం. గృహ రుణ రేట్లు 7.1 శాతానికి తగ్గే అవకాశం ఉంది, రూ.1 కోటి రుణంలో నెలకు రూ.1,440 వరకు ఆదా అవుతుంది.

రెపో రేటు 25 పాయింట్లు తగ్గింది.. మరి మీ లోన్‌ EMI ఎంత తగ్గుతుంది? పొదుపుపై వడ్డీ కూడా తగ్గుతుందా?
Emi

Updated on: Dec 07, 2025 | 1:49 AM

గత కొన్ని రోజులుగా దేశం మొత్తం దృష్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశంపై కేంద్రీకృతమై ఉంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారు? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంత అనుకున్నట్లే RBI ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత రెపో రేటు 5.25 శాతానికి చేరుకుంది. ఈ నిర్ణయం సామాన్యులకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. సామాన్యులకు, గృహ రుణాలు, ఆటో రుణాలు, అలాగే వ్యక్తిగత రుణాల EMIలను తగ్గించవచ్చు.

ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులు 7.35 శాతంకే గృహ రుణాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్‌బిఐ వడ్డీ రేటును తగ్గించాలని నిర్ణయించింది. దీని కారణంగా బ్యాంకులు అందించే గృహ రుణాల రేటు కూడా దాదాపు 7.1 శాతానికి తగ్గే అవకాశం ఉంది.

ఇప్పుడు రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు కాబట్టి, మన EMIలు ఎంత తగ్గుతాయానేది ఇప్పుడు చూద్దాం.. మీరు 15 సంవత్సరాలకు 1 కోటి రూపాయల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. RBI నిర్ణయం ప్రకారం.. ఈ రుణంపై వడ్డీ రేటు 0.25 శాతం తగ్గిస్తే, మీ నెలవారీ EMI దాదాపు రూ.1,440 వరకు తగ్గించవచ్చు. ఇది సామాన్యులకు ఎంతో ఉపశమనం కలిగించవచ్చు. రెపో రేటు తగ్గింపు తర్వాత గృహ రుణాలు 7.1 శాతానికి తగ్గితే, బ్యాంకులు మరికొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. బ్యాంకులు పొదుపు డిపాజిట్లపై వడ్డీని తగ్గించాల్సి రావచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి