బ్యాంక్ కస్టమర్లకు గుడ్‏న్యూస్.. బంపర్ ఆఫర్లను ప్రకటించిన పీఎన్బీ.. వారికి మాత్రమే బెనిఫిట్..

బ్యాంక్ కస్టమర్లకు గుడ్‏న్యూస్.. బంపర్ ఆఫర్లను ప్రకటించిన పీఎన్బీ.. వారికి మాత్రమే బెనిఫిట్..
Pnb

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గృహ రుణ ఆఫర్ కింద్ ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్

Rajitha Chanti

|

Aug 19, 2021 | 8:20 AM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గృహ రుణ ఆఫర్ కింద్ ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను పూర్తిగా మినహాయించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటున్నట్లుగా పీఎన్బీ తెలిపింది. అంటే తన కస్టమర్లకు కేవలం 6.80 శాతం గృహ రుణాలను బ్యాంకు అందిస్తోంది. గతంలో ఎస్బీఐ కూడా రిటైల్ కస్టమర్ల కోసం అనేక రకాల ఆఫర్లను అందించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ కార్ లోన్స్, కార్ ఆన్ రోడ్ ధరలో 90 శాతం వరకు రుణాల కోసం ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేసింది. యోనో యాప్ ద్వారా దఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేకంగా 0.25 శాతం డిస్కౌంట్ పొందుతారు. యోనో కస్టమర్లకు సంవత్సరానికి 7.5 శాతం చొప్పున కార్ లోన్ అందుబాటులో ఉంటుంది. యోనో ద్వారా గోల్డ్ లోన్ దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజ్ కూడా విధించబడుతుంది. ఇది కాకుండా.. వ్యక్తిగత, ఫించన్ రుణ వినియోగదారుల కోసం అన్ని ఛానెళ్లలో ప్రాసెసింగ్ ఫీజును 100 శాతం మినహాయిస్తున్నట్లు ప్రకటించింది.

తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు అలర్ట్ చేసింది. ఆగస్ట్ 18 అర్ధరాత్రి నుంచి ఆగస్ట్ 19 ఉదయం కొన్ని గంటల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిపివేయనున్నట్లుగా ట్వీట్ చేస్తూ.. తమ కస్టమర్లకు క్షమాపణ చెప్పింది.

నిర్వహణ కారణంగా ఆన్ లైన్ బ్యాంకింగ్, PNBone, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్, కార్పొరేట్ బ్యాంకింగ్ సర్వీస్, యూపీఐ, ఐఎంపీఎస్ సహా అన్ని రకాల సౌకర్యాలలో అంతరాయం కలగనుంది. ఇదిలా ఉంటే.. బంగారం మానిటైజేషన్ కోసం కూడా బ్యాంక్ అవకాశం ఇస్తోంది. మీ వద్ద ఉన్న బంగారు ఆభరణాల సహాయంతో డబ్బు సంపాదించవచ్చు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద కనీసం 10 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ కోసం బ్యాంక్ మూడు ఎంపికలను అందిస్తోంది. స్వల్పకాలిక డిపాజిట్ 1-3 సంవత్సరాలు ఉంటుంది. మధ్యకాలిక డిపాజిట్లు 5-7 సంవత్సరాలు, దీర్ఘకాలిక డిపాజిట్లు 12-15 సంవత్సరాల వరకు ఉంటాయి.

స్వల్పకాలిక డిపాజిట్ల కింద, 1 సంవత్సరానికి 0.50 శాతం, 1-2 సంవత్సరాలకు 0.60 శాతం మరియు 2-3 సంవత్సరాలకు 0.75 శాతం వడ్డీ లభిస్తుంది. మధ్యకాలిక డిపాజిట్లపై వడ్డీ రేటు 2.25 శాతం, దీర్ఘకాలిక డిపాజిట్‌లకు 2.50 శాతం.

Also Read: Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..

Kishan Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఏపీకి కీలక సూచనలు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu