Thermal Power: దేశంలోని పవర్‌ ప్లాంట్లలో తగ్గిన బొగ్గు కొరత.. పెరిగిన థర్మల్ విద్యుత్‌..

దేశంలో విద్యుత్ సంక్షోభం(Power Crisis) నేపథ్యంలో బొగ్గు(Coal) ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 9.26 శాతం పెరిగి ఏప్రిల్, 2022 నాటికి 10,0259 మిలియన్ యూనిట్లకు చేరుకుంది...

Thermal Power: దేశంలోని పవర్‌ ప్లాంట్లలో తగ్గిన బొగ్గు కొరత.. పెరిగిన థర్మల్ విద్యుత్‌..
Power
Follow us

|

Updated on: May 10, 2022 | 5:48 PM

దేశంలో విద్యుత్ సంక్షోభం(Power Crisis) నేపథ్యంలో బొగ్గు(Coal) ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 9.26 శాతం పెరిగి ఏప్రిల్, 2022 నాటికి 10,0259 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. అధికారిక లెక్కల ప్రకారం.. థర్మల్(Tharmal) పవర్ స్టేషన్ల విద్యుత్ ఉత్పత్తి ఏడాది క్రితం ఇదే నెలలో 9,3838 మిలియన్ యూనిట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి 9.26 శాతం పెరిగింది. ఇది మార్చి 2022 కంటే 2.25 శాతం ఎక్కువ. ఏప్రిల్‌లో మొత్తం విద్యుత్ ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 11.75 శాతం పెరిగి 12,2209 మిలియన్ యూనిట్ల నుంచి 13,6565 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.

ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి దేశీయ బొగ్గు అందుబాటులో లేకపోవడంతోపాటు వివిధ ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడమే కారణమని గతంలో బొగ్గు మంత్రిత్వ శాఖ పేర్కొంది. బొగ్గు దిగుమతులను పెంచడం ద్వారా విద్యుత్ సరఫరాలో కొరతను తీర్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు 2022-23లో విద్యుత్ పంపిణీ కంపెనీల (డిస్కమ్‌లు) సరఫరా వ్యయాన్ని 4.5-5 శాతానికి పెంచే అవకాశం ఉంది. దేశీయ బొగ్గుపై ఆధారపడిన అన్ని రాష్ట్రాలు, విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు (జెన్‌కో) తమ ఇంధన అవసరాలలో కనీసం 10 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకోవాలి. దిగుమతి చేసుకున్న బొగ్గును దేశీయ బొగ్గును ఉపయోగించడం వల్ల కరెంట్‌ కొరత అధికమించవచ్చని కేంద్రం పేర్కొంది. 2022 ఏప్రిల్, మే నెలల్లో దేశం విద్యుత్ డిమాండ్ వరుసగా 11.5 శాతం నుంచి 17.6 శాతం పెరిగిందని ICRA సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో-గ్రూప్ హెడ్ (కార్పొరేట్ రేటింగ్స్) గిరీష్ కుమార్ కదమ్ తెలిపారు.

Read Also.. LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకు దరఖాస్తు చేశారా.. అయితే షేర్లు వచ్చాయో లేదో ఇలా తెలుసుకోండి..