Air Pollution: వాయు కాలుష్యంతో ఢిల్లీ ఇక్కట్లు.. ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాత నగరాల్లో కాలుష్యాన్ని ఎలా ఎదుర్కున్నారో తెలుసా?

వాయు కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది. చాలా మంది, ముఖ్యంగా వృద్ధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

Air Pollution: వాయు కాలుష్యంతో ఢిల్లీ ఇక్కట్లు.. ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాత నగరాల్లో కాలుష్యాన్ని ఎలా ఎదుర్కున్నారో తెలుసా?
Air Pollution
Follow us

|

Updated on: Nov 22, 2021 | 5:16 PM

Air Pollution: వాయు కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది. చాలా మంది, ముఖ్యంగా వృద్ధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ అండ్ గ్రీన్ పీస్ సౌత్ ఈస్ట్ ఏషియా అధ్యయనం ప్రకారం ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా 2020లో 54,000 మంది మరణించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత వారం ఢిల్లీలో నిర్మాణ పనులను నిషేధించారు. ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేశారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. గ్యాస్ సంబంధిత పరిశ్రమ మినహా మిగిలిన అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ, శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఒకప్పుడు కాలుష్యం అనేది పెద్ద సమస్యగా ఉండే ప్రపంచంలోని ఏడు దేశాల గురించి తెలుసుకుందాం.. ఆ దేశాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడ్డాయి. అవి ఎలా బయటపడ్డాయో తెలుసుకుంటే.. ఢిల్లీ కాలుష్యం నుంచి బయటపడటానికి ఏమి చేయాలో మనకు అర్ధం అవుతుంది.

కాలుష్యంపై పోరాడేందుకు చైనా 19 ఏళ్ల పోరాటం..

1990ల ప్రారంభంలో, చైనా రాజధాని బీజింగ్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందడం వల్ల ఇక్కడి గాలి ఊపిరి పీల్చుకోవడానికి వీలులేని విధంగా తయారైంది. గాలిలో పీఎం 2.5 కాలుష్యం స్థాయి పెరిగి కొన్ని మీటర్ల దూరంలో ఏముందో కూడా కనిపించడం కష్టంగా మారింది. 20 మిలియన్ల జనాభా ఉన్న ఈ నగరంలో పరిస్థితి దిగజారడం చూసిన చైనా 1998లో కాలుష్యంపై పోరాటం ప్రారంభించింది.

మొదట, కార్బన్ ఉద్గారాలను పెంచే కార్లను తగ్గించడం ప్రారంభించారు. తూర్పు చైనాలోని నాజింగ్‌లో మానవ నిర్మిత అడవులు సృష్టించారు. ఇది ప్రతి సంవత్సరం 2.5 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించడంలో సహాయపడింది. 60 కిలోల ఆక్సిజన్‌ను కూడా ఉత్పత్తి చేసింది. ఫలితంగా, 2013 నాటికి బీజింగ్‌లో కాలుష్యం తగ్గడం ప్రారంభమైంది. 2017 నాటికి కాలుష్య స్థాయి గణనీయంగా తగ్గింది.

థాయ్‌లాండ్‌లో..

థాయ్‌లాండ్‌లోని మిలిటరీ మానిటర్ ఫ్యాక్టరీలు 17 మిలియన్ల జనాభాతో ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఒకప్పుడు కాలుష్యం ప్రధాన సమస్యగా మారాయి. 2019లో ఇక్కడి పరిస్థితి ఢిల్లీలా తయారైంది. పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సి వచ్చింది. ఇది మాత్రమే కాదు, కర్మాగారాలు,పరిశ్రమలను పర్యవేక్షించడానికి సైన్యాన్ని మోహరించారు. దిగజారుతున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు థాయిలాండ్ కఠిన చర్యలు తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించారు. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను నిషేధించారు. రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించేందుకు కాలువల్లో బోటింగ్ ద్వారా కొత్త రవాణా మార్గాలను అన్వేషించారు.

మెక్సికో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించింది

1990ల ప్రారంభంలో, మెక్సికో నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటి. అమెరికా పొరుగు దేశం మెక్సికో రాజధాని జనాభా అప్పుడు 9 మిలియన్లు. వాయు కాలుష్యం పెరగడంతో మెక్సికో కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను నిషేధించారు. అనేక చమురు శుద్ధి కర్మాగారాలను కూడా మూసివేయవలసి వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించారు. ఈ అన్ని ప్రయత్నాల ప్రభావం ఏమిటంటే, 2018 చివరి నాటికి, ఇక్కడ PM 2.5 కాలుష్యం స్థాయి 300 నుండి 100కి తగ్గింది.

ఫ్రాన్స్ ఆ 3 నిర్ణయాలు..

డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం 2019లో ఐరోపాలో కాలుష్యం కారణంగా 3 లక్షల మందికి పైగా మరణించారు. చాలా అందమైన నగరం.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కూడా కాలుష్యం మొత్తం పెరుగుతోంది. 21 లక్షల జనాభా ఉన్న ఈ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు.

1. పారిస్‌లో వారాంతాల్లో కారు ప్రయాణం నిషేధించారు. 2. ప్రజా రవాణా ఉచితంగా చేశారు. 3. కారు, బైక్ షేరింగ్ ప్రచారం చేస్తూ వస్తున్నారు.

నెదర్లాండ్స్..

2025 నుండి నెదర్లాండ్స్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. యూరోపియన్ దేశమైన నెదర్లాండ్స్ ప్రజలు కూడా కాలుష్యం గురించి చాలా సున్నితంగా ఉంటారు. ఇక్కడ ఎక్కువ మంది ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిల్‌నే వినియోగిస్తారు. 2015 సంవత్సరంలో, ఈ దేశ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో గాలి నాణ్యతలో స్వల్ప వ్యత్యాసం ఉంది. దీని తరువాత ప్రభుత్వం, ప్రజలు దానిపై పని చేయడం ప్రారంభించారు. 2030 నాటికి, నెదర్లాండ్స్‌లో పెట్రోల్, డీజిల్‌తో నడిచే అన్ని వాహనాలను నిషేధించే ప్రణాళిక ఉంది. ఇది మాత్రమే కాదు, 2025 తర్వాత ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించబడతాయి.

స్విట్జర్లాండ్‌లో భారీ పార్కింగ్ ఫీజులు ఉత్తర స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరం కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది. ఇక్కడ పార్కింగ్‌ను పరిమితం చేసేందుకు మొదటి గంటను ఉచితంగా ఉంచినప్పటికీ ఆ తర్వాత భారీగా రుసుము విధించారు. అంతే కాదు నగరంలోని రోడ్లపై ఒకేసారి ఎన్ని కార్లు ఉండాలనేది కూడా నిర్ణయించారు. చాలా ప్రాంతాలను కార్ ఫ్రీ జోన్‌లుగా ప్రకటించారు. స్విట్జర్లాండ్ మొత్తం జనాభా 86 లక్షలు మాత్రమే.

ఉత్తర ఐరోపాలోని స్కాండినేవియన్ దేశమైన డెన్మార్క్ ప్రజలు సూట్లు-బూట్లతో సైకిల్‌పై తిరుగుతారు. ఈ దేశ జనాభా మొత్తం 19 లక్షలు మాత్రమే. ఇక్కడ సూట్-బూట్‌లు వేసుకున్న వ్యక్తులు వీధుల్లో సైకిల్‌పై తిరుగుతూ కనిపిస్తారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించడానికి ఇష్టపడతారు. నగరం 2025 నాటికి కార్బన్ ఉద్గారాలను 0%కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి: Stock Market: మళ్ళీ పడిపోయిన రిలయన్స్ షేర్ల ధరలు .. భారీగా తగ్గిన మార్కెట్ కాప్.. బజాజ్ గ్రూప్ షేర్లు కూడా.. ఎంతంటే..

IRCTC Ramayan Yatra: రామాయణ సర్క్యూట్ రైల్‌లో వెయిటర్ల దుస్తులపై వివాదం.. ఉజ్జయిని మహర్షుల అభ్యంతరం ఎందుకంటే..

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!