ఐదు రూపాయలకే బ్యాంక్‌ ఖాతా..! ఉచితంగా ఏటీఎం కార్డ్, చెక్‌బుక్‌.. ఏ బ్యాంకులో తెలుసా..?

Bank of Baroda Pension Account : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక పెన్షన్ ఖాతా అందిస్తోంది.. వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఖాతాను 5

  • uppula Raju
  • Publish Date - 5:14 am, Wed, 7 April 21
ఐదు రూపాయలకే బ్యాంక్‌ ఖాతా..! ఉచితంగా ఏటీఎం కార్డ్, చెక్‌బుక్‌.. ఏ బ్యాంకులో తెలుసా..?
Bank

Bank of Baroda Pension Account : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక పెన్షన్ ఖాతా అందిస్తోంది.. వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఖాతాను 5 రూపాయలతో తెరవవచ్చు. దీంతో డెబిట్ కార్డు, చెక్‌బుక్‌ ఉచితంగా ఇస్తారు. ఈ ఖాతా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..

1. బరోడా పెన్షనర్స్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా
బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం కేవలం 5 రూపాయలకు పెన్షన్ ఖాతా తెరవవచ్చు. 2 నెలల పెన్షన్ మొత్తానికి సమానమైన సేవింగ్స్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. పింఛనుదారుడు ఇతర రుణ సదుపాయాన్ని మాత్రం పొందలేడు.

2. బీమా ఉచితంగా ఇవ్వబడుతుంది..
లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా వినియోగదారులకు ఉచితంగా ఇవ్వబడుతుంది. నిరక్షరాస్యులైన పెన్షనర్లకు తప్పఅందరికి చెక్ బుక్ సౌకర్యం ఉంది.

3. నగదు ఉపసంహరణ నియమాలు..
ఆధార్ / స్థానిక నాన్-బేస్ బ్రాంచ్ బాహ్య శాఖల నుంచి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఎటువంటి రుసుము ఉండదు. కానీ బాహ్య శాఖలలో ఖాతాదారుడు రోజుకు గరిష్టంగా 50000 రూపాయల వరకు నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

4. ముఖ్యమైన విషయాలు
ఒక కస్టమర్ రెండు సంవత్సరాలు పొదుపు ఖాతాలో ఎటువంటి లావాదేవీలు చేయకపోతే ఖాతా పనిచేయదు. ఖాతా తొలగించడానికి ఎటువంటి ఛార్జీలు విధించబడవు.

5. పనిచేయని ఖాతాలను సక్రమంగా చేయడానికి KYC పత్రాలు, ఫోటో, కొత్త నమూనా సంతకం బ్యాంకు అధికారికి సమర్పించాలి.

6. ఈ ఖాతా ద్వారా 10 సంవత్సరాలు లావాదేవీలు నిర్వహించకుంటే ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని క్లెయిమ్ చేయని డిపాజిట్లుగా పరిగణిస్తారు. ఈ మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేయబడుతుంది. అటువంటి డిపాజిట్లకు సంబంధించి దరఖాస్తు అందిన తరువాత వినియోగదారులు వారి డిపాజిట్ షరతులకు లోబడి తిరిగి ఇస్తారు.

7. కనీస డిపాజిట్ టెన్షన్ లేదు. డిమాండ్ డ్రాప్ట్‌, బ్యాంకు చెక్కుల ద్వారా నెలకు గరిష్టంగా లక్ష వరకు ఉచితంగా లావాదేవీలు చేయవచ్చు. అలాగే నామినేషన్ సౌకర్యం కూడా లభిస్తుంది.

Narang set to Marry: ఓ ఇంటివాడు కాబోతున్న స్టార్​ షూటర్​ గగన్ నారంగ్​.. 21న హైదరాబాద్‌లోని ఒక స్టార్‌ హోటల్లో వివాహం

వైసీపీ సర్కారుకి హైకోర్టు తీర్పు చెంపపెట్టన్న బాబు, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారకూడదని హితవు

పీపీఈ కిట్‌లో వచ్చి ఓటేసిన ఎంపీ కనిమొళి.. మీడియాకు విజయ సంకేతం చూపించి తిరిగి అంబులెన్స్‌లోకి..