Mutual Funds: కొత్త సంవత్సరంలో ఈ 5 మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి.. అద్భుత ప్రయోజనాలు పొందుతారు..

కొత్త సంవత్సరంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకు మంచి రాబడి వచ్చే ప్లాన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి రావడానికి మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంచుకోవచ్చు.

Mutual Funds: కొత్త సంవత్సరంలో ఈ 5 మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి.. అద్భుత ప్రయోజనాలు పొందుతారు..
Mutual Funds
Follow us

|

Updated on: Dec 20, 2022 | 7:20 AM

కొత్త సంవత్సరంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకు మంచి రాబడి వచ్చే ప్లాన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి రావడానికి మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడానికి కష్టతరమైన మార్గంగా పరిగణిస్తారు. కానీ, వీటిలో పెట్టుబడి పెట్టడం చాలా ఈజీ. అంతేకాకుండా, వీటి ద్వారా అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. వీటిలో పారదర్శకత, లిక్విడిటీతో పాటు వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. సరళంగా చెప్పాలంటే.. మ్యూచువల్ ఫండ్‌లు పెట్టుబడి సాధనాలు. ఇందులో ఈక్విటీ, డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లు మొదలైన వివిధ సెక్యూరిటీలు ఉంటాయి. రాబోయే సంవత్సరంలో మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమో ఇవ్వాళ తెలుసుకుందాం. CRISIL రేటింగ్స్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్..

SBI కాంట్రా ఫండ్..

ఈ మ్యూచువల్ ఫండ్ CRISIL రేటింగ్స్‌లో నం.1 స్థానంలో ఉంది. ఇందులో ఇన్వెస్టర్లు దీర్ఘకాలికంగా మంచి రాబడులు పొందుతారు. ఈ ఫండ్ గత మూడేళ్లలో పెట్టుబడిదారులకు 31.85 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. ఇది అధిక రాబడికి ఉత్తమమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా పేర్కొంటున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ఎస్‌బిఐ కాంట్రా ఫండ్ టాప్ హోల్డింగ్‌లు. అయితే, పెద్ద మొత్తంలో ఫండ్ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం వలన ఇది కాస్ల రిస్క్‌తో కూడుకున్నది.

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్..

CRISIL రేటింగ్స్‌లో ఇది కూడా నంబర్ 1 స్థానంలో ఉంచింది. ఇందులో స్మాల్ క్యాప్ కంపెనీల పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలికంగా మంచి రాబడులు వస్తాయి. ఈ ఫండ్ మూడు సంవత్సరాల వార్షిక రాబడిని దాదాపు 56% ఇచ్చింది. నిజంగా ఇది సూపర్ అనాలి. అయితే, ఈ ఫండ్ రాబడులు అస్థిరంగా ఉంటాయనేది కూడా గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్..

ఈ ఫండ్‌కు CRISIL నంబర్ 1 ర్యాంక్ ఇచ్చింది. ఇందులో రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫండ్‌లోని మూలధనంతో పాటు రెగ్యులర్ డివిడెండ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ గత మూడేళ్లలో 21% వార్షిక రాబడిని ఇచ్చింది. ఫండ్ ప్రధాన హోల్డింగ్‌లు ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ స్టాక్‌లలో ఉన్నాయి. పెట్టుబడిలో 66 శాతం పెద్ద క్యాప్ హోల్డింగ్స్‌లో ఉంది.

SBI లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్..

ఇది పెద్ద, మిడ్‌క్యాప్ ఫండ్ల కలయికతో ఉంటుంది. పెట్టుబడులకు ఇది కూడా మంచి ఆప్షన్. విభిన్నమైన పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టడం ద్వారా చాలా కాలం పాటు రాబడిని పొందే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. ఇందులో మూడేళ్లలో 22 శాతం చొప్పున రాబడులు లభిస్తాయి. అయితే, ఐదేళ్లలో సంవత్సరానికి 13.47% రాబడులు అందుబాటులో ఉంటాయి.

పరాగ్ పారిఖ్ ట్యాక్స్ సేవర్ ఫండ్..

ఇది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఉంటుంది. ఫండ్ గత మూడేళ్లలో 24% వార్షిక రాబడిని ఇచ్చింది. దీని స్టాక్‌లలో HDFC, బజాజ్ హోల్డింగ్స్, ITC మొదలైనవి ఉన్నాయి. ఈ ఫండ్ ఈక్విటీ హోల్డింగ్స్ 84 శాతం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..