హాస్టళ్లు ఖాళీ చేయండి..! జేఎన్‌యూ

అప్పుడు కుదరలేదు… ఇప్పుడైనా వెళ్లండి అంటూ విద్యార్థులను ఢిల్లీ జేఎన్‌యూ కోరింది. హాస్టళ్లలో చిక్కుకుపోయిన విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లాలని జేఎన్‌యూ ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. లాక్‌డౌన్ సడలింపులతో రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని అందులో పేర్కొంది. ప్రత్యేక రైళ్లు… ఆర్టీసీ సర్వీసులను మాత్రమే వినియోగించాలని సూచించింది. ఢిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని ఆ సర్క్యులర్‌లో వెల్లడించింది. జూన్‌ చివరి వారం వరకు వర్సిటీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, అప్పటివరకు విద్యార్థులు సొంతూళ్లలోనే […]

హాస్టళ్లు ఖాళీ చేయండి..! జేఎన్‌యూ

అప్పుడు కుదరలేదు… ఇప్పుడైనా వెళ్లండి అంటూ విద్యార్థులను ఢిల్లీ జేఎన్‌యూ కోరింది. హాస్టళ్లలో చిక్కుకుపోయిన విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లాలని జేఎన్‌యూ ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. లాక్‌డౌన్ సడలింపులతో రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని అందులో పేర్కొంది. ప్రత్యేక రైళ్లు… ఆర్టీసీ సర్వీసులను మాత్రమే వినియోగించాలని సూచించింది. ఢిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని ఆ సర్క్యులర్‌లో వెల్లడించింది. జూన్‌ చివరి వారం వరకు వర్సిటీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, అప్పటివరకు విద్యార్థులు సొంతూళ్లలోనే ఉండాలని జేఎన్‌యూ సూచించింది.