Jawa celebrates: విజయోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న జావా.. మార్కెట్‌లోకి స్పెషల్ డిజైన్..

50 ఏళ్ల విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించుకునేందుకు దేశం సిద్దమవుతోంది. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్‌ విజయం సాధించిన సందర్భంగా కొత్త రంగుల్లో మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది...

Jawa celebrates: విజయోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న జావా.. మార్కెట్‌లోకి స్పెషల్ డిజైన్..
Jawa Celebrates
Follow us

|

Updated on: Jul 12, 2021 | 2:22 PM

50 ఏళ్ల విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించుకునేందుకు దేశం సిద్దమవుతోంది. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్‌ విజయం సాధించిన సందర్భంగా కొత్త రంగుల్లో మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది టూ వీలర్ తయారీ సంస్థ జావా. రెండు కొత్త రంగుల్లో మోటార్‌సైకిళ్లను ప్లాన్ చేసింది. యుద్ధంలో తిరుగులేని పోరాటం కొనసాగించిన భారత జవాన్లకు గుర్తింపుగా ఖాకీ, మిడ్‌నైట్‌ గ్రే కలర్లలో స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటి ఇంధన ట్యాంకుపై భారత జాతీయ జెండాతో పాటు భారత సైన్యానికి చెందిన చిహ్నాన్ని ముద్రించారు. “1971 యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1971-2021” అని రాయడం చాల ప్రత్యేకంగా నిలుస్తోంది.

జావా ప్రత్యేక ఎడిషన్లపై పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. యుద్ధంలో విజయం సాధించిన హీరోలకు గౌరవంగా కొత్త ఎడిషన్‌ బైక్‌లను తీసుకురావడం కోసం జావా బృందం చేసిన ప్రయత్నం చూస్తే గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. బైక్‌లపై భారత సైన్యం చిహ్నం ఉంచే అవకాశం రావడం ఎంతో గౌరవం అన్నారు.

ఇక ఈ స్పెషల్‌ ఎడిషన్ బైక్ ధరను రూ.1.93 లక్షలుగా నిర్ణయించారు. జావా42 ధరతో పోలిస్తే రూ.15,000, స్టాండర్డ్‌ వెర్షన్‌తో పోలిస్తే రూ.6,000 అధికం. వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా ఈ బైక్‌ను బుక్‌ చేసుకోవచ్చు. 293 సీసీ సింగిల్‌ సిలిండర్ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ 26.9 బీహెచ్‌పీ శక్తి వద్ద 27.02 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Rajinikanth Confirms: పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్.. మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తూ ప్రకటన..

Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..