Mutual Fund: నెలకు రూ.10000 పెట్టుబడితో రూ.9 లక్షల పెన్షన్ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..

పెట్టుబడి పెట్టడానికి మొదటి ఎంపిక మ్యూచువల్ ఫండ్స్ అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‎లో ప్రజలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌(SIP) వైపు మొగ్గు చూపుతున్నారు...

Mutual Fund: నెలకు రూ.10000 పెట్టుబడితో రూ.9 లక్షల పెన్షన్ పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
Money
Follow us

|

Updated on: Nov 29, 2021 | 8:06 AM

పెట్టుబడి పెట్టడానికి మొదటి ఎంపిక మ్యూచువల్ ఫండ్స్ అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‎లో ప్రజలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌(SIP) వైపు మొగ్గు చూపుతున్నారు. మ్యూచువల్ ఫండ్ SIP అతిపెద్ద లక్షణం ఏమిటంటే, ప్రతి నెలా చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా కూడా, మీరు మెచ్యూరిటీపై పెద్ద మొత్తాన్ని సేకరించవచ్చు. ఇది పెట్టుబడి డబ్బును అనేక రెట్లు పెంచుతుంది. మీరు కొంత డబ్బును పొదుపు చేయడం ద్వారా పదవీ విరమణ కోసం పెన్షన్‌ను కూడా సిద్ధం చేయాలనుకుంటే మీరు SIPలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఒక వ్యక్తి ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్‎లో SIP రూపంలో 30 సంవత్సరాలు రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో అతను రూ. 12.7 కోట్ల కార్పస్‌ను సృష్టించవచ్చని పన్ను పెట్టుబడి నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం డబ్బును 10% పెంచడం ద్వారా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది, అయితే దీర్ఘకాలంలో ఈ మార్కెట్ రిస్క్ తగ్గుతుంది, అధిక రాబడికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఒక పెట్టుబడిదారు మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టాలని ఎంచుకుంటే, పెట్టుబడిదారుడు చిన్న మొత్తంతో ప్రారంభించి, ఎక్కువ కాలం పాటు పెద్ద మొత్తంలో జమ చేసుకోవచ్చు. కానీ, మీ వార్షిక ఆదాయం పెరిగితే, దానికి అనుగుణంగా SIP మొత్తాన్ని కూడా పెంచాలని. సెబీ రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి ‘మింట్’తో చప్పారు.

మీరు 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే.. 12 శాతం రాబడిని ఆశించవచ్చు. ఇది వార్షిక ప్రాతిపదికన 16 లేదా 17 శాతం కూడా కావచ్చు. 30 ఏళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, 16% వరకు రాబడిని ఆశించవచ్చు. ఇది ఏ SIP ప్లాన్ తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, నెలవారీ SIPపై 15 శాతం రాబడిని ఊహిస్తే, ఒక పెట్టుబడిదారుడు 10 శాతం వార్షిక స్టెప్-అప్‌ని ఉపయోగించి నెలకు రూ. 10,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే (అంటే వార్షిక సంపాదనలో 10 శాతం ప్రతి సంవత్సరం పెట్టుబడులలో పెంచాలి). SIP కాలిక్యులేటర్ ప్రకారం, రూ. 12,69,88,106 లేదా రూ. 12.70 కోట్ల మెచ్యూరిటీ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఈ మెచ్యూరిటీ మొత్తం ఆధారంగా, నెలవారీ పెన్షన్ కూడా నిర్ణయించవచ్చు. పెన్షన్ డబ్బును ఉపసంహరించుకోవడానికి SWP సిస్టమాటిక్ ఉపసంహరణ ప్రణాళికను తీసుకుంటారు. SWP కింద మొత్తం మొత్తం డిపాజిట్ చేయబడుతుంది. దీని నుండి ప్రతి నెలా సాధారణ ఆదాయం పొందుతూ ఉంటుంది. SIP ద్వారా వచ్చిన రూ.12.70 కోట్లు SWPలో జమచేస్తే, పింఛను పెన్షన్‎గా పొందవచ్చు. ఒక వ్యక్తి SWPలో రూ. 12.69 కోట్లు డిపాజిట్ చేస్తే, అతను సంవత్సరానికి 8 శాతం రాబడితో ప్రతి నెలా 9 లక్షల స్థిర ఆదాయాన్ని పొందుతాడు. ఈ ఆదాయాన్ని నెలవారీ పెన్షన్ రూపంలో పొందవచ్చు అని MyFundBazaar CEO, వ్యవస్థాపకుడు వినిత్ ఖండారే చెప్పారు.

Read Also.. Petrol Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు