“చాపాతి-పరోటా “..ఇదే ఇప్పుడు ట్రెండింగ్

పరోటా, రోటీ, చపాతి… ఇదేం హోటల్ మెనూ కాదు… ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో  ట్రెండింగ్ అవుతున్న టాపిక్. ట్విట్టర్‌ వేదికగా వీటిపై జోరుగా జోకులు పేలుతున్నాయి. ఇదేంటి ఇప్పుడు వీటి గురించి ఎందుకు చర్చ జరుగుతోందని అనుకుంటున్నారా… అయితే ఇక చదవండి… చపాతి(రోటీ)కి పరోటాకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే… బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న ఐడీ ఫ్రెష్ ఫుడ్ అనే సంస్థ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్- కర్నాటక బెంచ్ (ఏఏఆర్)ను ఆశ్రయించింది. గోధుమ […]

  • Sanjay Kasula
  • Publish Date - 11:07 am, Sat, 13 June 20
"చాపాతి-పరోటా "..ఇదే ఇప్పుడు ట్రెండింగ్

పరోటా, రోటీ, చపాతి… ఇదేం హోటల్ మెనూ కాదు… ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో  ట్రెండింగ్ అవుతున్న టాపిక్. ట్విట్టర్‌ వేదికగా వీటిపై జోరుగా జోకులు పేలుతున్నాయి. ఇదేంటి ఇప్పుడు వీటి గురించి ఎందుకు చర్చ జరుగుతోందని అనుకుంటున్నారా… అయితే ఇక చదవండి…

చపాతి(రోటీ)కి పరోటాకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే… బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న ఐడీ ఫ్రెష్ ఫుడ్ అనే సంస్థ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్- కర్నాటక బెంచ్ (ఏఏఆర్)ను ఆశ్రయించింది. గోధుమ పిండితో తయారు చేసే చపాతీ , మలబార్ పరోటాల మధ్య తేడా ఇంత తేడా ఎందుకు అని ప్రశ్నించింది. వారి పిటిషన్ ఏఏఆర్ విచారించింది. పరోటా సాదా చపాతీ (రోటీ) కిందకు రాదని తేల్చింది. రోటీ రెడీ టు ఈట్ ఫుడ్ అని, పరోటా(ఖాఖ్రా)ను మాత్రం వేడి చేయాల్సి ఉంటుందని అందువల్ల దాన్ని రోటీ విభాగం కిందకు పరోటాను తీసుకురావడం కుదరదని తేల్చిచెప్పింది. పరోటా, రోటీ ఈ రెండు ఒకటి కాదని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ ధర్మాసనం తేల్చింది.

దీంతో  కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం చాలా సవాళ్లను ఎదుర్కొంటున్న భారతదేశానికి కొత్తగా పరోటా సవాల్‌ వచ్చి చేరిందని ట్విటర్‌‌లో కామెంట్ చేశారు ఆనంద్ మహేంద్రా. ఏఏఆర్‌ తాజా ప్రకటనతో పరోటా ఉనికికే ప్రమాదం వచ్చిందని వ్యాఖ్యానిస్తు… రోటీ కోవాకు చెందిన పరోటాను వేరు చేయటం బాధించిందని అన్నారు. దీంతో ఇదే విషయం ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయ్యింది.
ఇంకేంముంది దేశవ్యాప్తంగా పరోటా చర్చ మొదలైంది. నెటిజన్లు తమకు నచ్చిన మీమ్స్, కామెడీ కార్టున్లను పోస్ట్ చేస్తున్నారు.