Indian Rice: నిలిచిపోయిన 10 లక్షల టన్నుల బియ్యం రవాణా.. ఎందుకని స్థంభించిపోయాయి..?

Indian Rice: ఒకటీ రెండు కాదు ఏకంగా పది లక్షల టన్నుల బియ్యం రవాణా ఆగిపోయింది. ఇన్ని లక్షల టన్నుల బియ్యం ఆగడానికి కారణాలేమై ఉంటాయ్? ఎందుకని వీటి ..

Indian Rice: నిలిచిపోయిన 10 లక్షల టన్నుల బియ్యం రవాణా.. ఎందుకని స్థంభించిపోయాయి..?
Subhash Goud

|

Sep 21, 2022 | 8:45 AM

Indian Rice: ఒకటీ రెండు కాదు ఏకంగా పది లక్షల టన్నుల బియ్యం రవాణా ఆగిపోయింది. ఇన్ని లక్షల టన్నుల బియ్యం ఆగడానికి కారణాలేమై ఉంటాయ్? ఎందుకని వీటి ఎగుమతి దిగుమతులు స్థంభించిపోయాయి? కేంద్రం సెప్టెంబర్ 8న నూక బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అంతే కాదు వివిధ రకాల ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ధాన్యం ఎగుమతిదారు అయిన భారత్. రుతుపవనాల సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో సరఫరాలు, ధరలను పెంచడానికి ప్రయత్నిస్తోంది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. భారత్ బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించడం వల్ల.. ఆసియాలో వాణిజ్యం ఒక్కసారిగా స్థంభించింది. కొనుగోలు దారులు వియత్నాం, థాయిలాండ్, మయన్మార్ నుంచి ప్రత్యామ్నయ సరఫరాల కోసం వెతుకుతున్నారు.

ఇక్కడ ధరలు పెరగడంతో ఒప్పందాలు రద్దయిపోతున్నాయని అంటున్నారు అధికారులు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటికే ఎన్నో వాణిజ్యలావాదేవీలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. సరఫరా పెంచడానికి, ద్రవ్యోల్బణంతో పోరాడ్డానికీ ఎన్నో దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఏడాది ఎగుమతి నియంత్రణలు ఎదుర్కుంటున్న వస్తువుల వరుసలో బియ్యం కూడా వచ్చి చేరింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆసియాలోని బియ్యం ధరలు ఒక్కసారిగా ఐదు శాతం మేర పెరిగాయి. ఈ వారంలో మరింత పెరిగే అవకాశముందని అంచనా.

ఆసియా అంతటా బియ్యం వ్యాపారం నిలిచిపోవడంతో.. వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ షిప్మెంట్లలో భారత్ వాటా 40 శాతం కంటే ఎక్కువగా ఉంది. అందుకే వచ్చే రోజుల్లో ధరలెంత పెరుగుతాయో చెప్పలేమంటున్నారు.. వ్యాపారులు. సుమారు 300 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఒక నిత్యావసరం. 2007లో కూడా భారత్ ఎగుమతులు నిషేధించినపుడు ప్రపంచ ధరలు టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగాయి. ప్రస్తుతం భారతీయ ఓడరేవుల్లో రైస్ లోడింగ్ ఆగిపోయింది. ముందుగా ఒప్పుకున్నదానికంటే.. ఎక్కువ లెవీ చల్లించడానికి కొనుగోలుదారులెవరూ.. రెడీగా లేరు. దీంతో సుమారు 10 లక్షల టన్నుల ధాన్యం ఎక్కడిక్కడ చిక్కుకు పోయింది. కొత్త కాంట్రాక్టుల కోసం కొందరు రెడీగా ఉన్నప్పటికీ.. పెండింగ్ లో ఉన్న ఒప్పందాలను ఎలాగైనా సరే సరి చేయాలని చూస్తున్నారు వ్యాపారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu