Indian Railways: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ ప్రారంభానికి రెడీ.. ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే..

దేశంలో తొలి హైడ్రోజన్ రైలుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఇది పట్టాలెక్కనుందని తెలుస్తోంది. హర్యానాలోని జింద్-సోనిపత్ రూట్లో దీనిని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 10 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఒకేసారి 2,600 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించే వెసులుబాటు ఉంది.

Indian Railways: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ ప్రారంభానికి రెడీ.. ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
Train

Updated on: May 27, 2026 | 3:17 PM

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలును త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు త్వరలో ప్రారంభించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. హర్యానాలో తొలి హైడ్రోజన్ రైలు సర్వీసులు అందించనుండగా.. మొత్తం 89 కిలోమీటర్ల మేర ఇది తిరగనుంది. జింద్-సోనిపత్ రూట్లో ఇది నడుస్తుందని రైల్వేశాఖ తెలిపింది. రోజుకు రెండు ట్రిప్పులు ఇది తిరగనుండగా.. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఒకేసారి 2,600 మంది ప్రయాణికులను ఇది తీసుకెళ్తుందని అంచనా వేశారు.

హైడ్రోజన్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే..

ఇది ఒక లోకల్ ప్యాసింజర్ ట్రైన్ అయినప్పటికీ.. భారత్‌కు హైడ్రోజన్ ప్రయాణంకు సంబంధించిన నిజమైన అనుభూతిని అందించనుంది. దీని నుంచి డీజిల్ పొగ కాకుండా నీటి ఆవిరి వెలువడనుంది. రైల్వే బోర్డు ఆమోదం తెలపడంతో త్వరలోనే ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ హైడ్రోజన్ రైలు ఒక డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ కలిగి ఉంటుంది. అలాగే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని దీనికి అమర్చారు. ఈ రైలు 10 కోచ్‌లు కలిగి ఉంటుంది. 1,200 కిలోవాటల్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను ఇది ఉపయోగిస్తుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

లిస్టులోకి భారత్ కూడా..

దేశంలో హరిత రవాణాను ప్రోత్సహించడంలో హైడ్రోజన్ రైలు కీలక అడుగుగా చెబుతున్నారు. హరిత హైడ్రోజన్ మిషన్‌ లక్ష్యానికి చేరువ అవ్వడంలో భాగంగా ఇది ఒక ముఖ్య అడుగుగా చెప్పవచ్చు. 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను సున్నాకు చేర్చాలనే లక్ష్యం కేంద్రం నిర్ణయించుకుంది. అందులో భాగంగా హైడ్రోజన్ రైలు తీసుకొచ్చింది. అయితే ట్రయల్ రన్ మార్చిలో పూర్తవ్వగా.. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ పరీక్షను నిర్వహించింది. ఇప్పటికే జర్మనీ, స్వీడన్, జపాన్, చైనా వంటి దేశాలు హైడ్రోజన్ రైళ్లను నడుపుతుండగా.. అటువంటి దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరనుంది.

Follow Us