Indian Railway: వివిధ పనుల కారణంగా 2021-22 మొదటి 9 నెలల్లో 35వేల రైళ్లు రద్దు..!

Indian Railway: వివిధ పనుల కారణంగా 2021-22 మొదటి 9 నెలల్లో 35వేల రైళ్లు రద్దు..!

Indian Railway: నిర్వహణ కారణాల వల్ల 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో భారతీయ రైల్వే 35,000 కంటే ఎక్కువ రైళ్లను..

Subhash Goud

| Edited By: Ravi Kiran

Jan 24, 2022 | 7:22 AM

Indian Railway: నిర్వహణ కారణాల వల్ల 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో భారతీయ రైల్వే 35,000 కంటే ఎక్కువ రైళ్లను రద్దు చేసింది . సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ప్రతిస్పందనగా రైల్వే ఈ విషయం చెప్పింది . 2021-22లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నిర్వహణ కారణాల వల్ల 20,941 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే తెలిపింది. తర్వాతి త్రైమాసికంలో, 7117 రైళ్లను రద్దు చేయగా, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు త్రైమాసికంలో 6,869 రైళ్లు రద్దు చేయబడ్డాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ దరఖాస్తు చేశారు. ఇటీవలి కాలంలో నిర్వహణ పనుల కారణంగా 2019లో అత్యధికంగా 3,146 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు సూచించారు.

అధికారిక లెక్కల ప్రకారం.. నిర్వహణ పనుల కారణంగా 2014లో 101 రైళ్లు రద్దు కాగా, 2017లో వాటి సంఖ్య 829కి పెరిగింది. ఇక 2018లో 2,867కి, 2019లో 3,146కి పెరిగింది. 41 వేలకు పైగా రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020లో చాలా వరకు రైల్వే తన సాధారణ ప్రయాణీకుల సేవలన్నింటినీ నిలిపివేసింది. 2021 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 15,199 మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యమయ్యాయని, అదే సమయంలో 26,284 ప్యాసింజర్ రైళ్లు ఆలస్యమయ్యాయని ఆర్‌టిఐకి ప్రతిస్పందనగా రైల్వే తెలిపింది. ఆలస్యమైన మొత్తం రైళ్ల సంఖ్య 41,483కి చేరుకుంది.

రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, రాబోయే కొన్నేళ్లలో రూ. 1,15,000 కోట్ల విలువైన 58 సూపర్ క్రిటికల్, 68 క్రిటికల్ ప్రాజెక్ట్‌లను అందించడానికి సిద్దంగా ఉంది. 29 సూపర్ క్రిటికల్ ప్రాజెక్టుల్లో 27 డిసెంబర్ 2021 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, రెండు ప్రాజెక్టులను ఈ ఏడాది మార్చి నాటికి అప్పగించనున్నారు.

సమయపాలన పనితీరు తగ్గింది

రైళ్లు పున:ప్రారంభమై సాధారణ కార్యకలాపాలు ప్రారంభమైనందున రైల్వేల సమయపాలన తగ్గిందని RTI వెల్లడించింది. ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో, రైల్వే ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్నప్పుడు, 7,050 రైళ్లు రద్దు చేయబడ్డాయి సమయపాలన పనితీరు దాదాపు 94 శాతంగా ఉంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 14,249 రైళ్లు ఆలస్యం కావడంతో ఈ పనితీరు 92 శాతం పడిపోయింది.

ఇవి కూడా చదవండి:

Digital Voter ID: డిజిటల్‌ ఓటర్ ఐడీ కార్డ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి.. గుర్తింపు కార్డుగా ఎక్కడైనా పనిచేస్తుంది..

Twitter CEO Parag Agrawal: ట్విట్టర్​లో పలువురి తొలగింపు.. ప్రక్షాళన ప్రారంభించిన పరాగ్‌ అగర్వాల్‌..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu