Income Tax Notice: మీరు కూడా ఈ తప్పు చేశారా?..అయితే ఇప్పుడు మీ ఇంటికి కూడా ఐటీ అధికారులు నోటీసులు పంపుతారు జాగ్రత్త..

ITR Refund & Notices: మీరు డబ్బును నగదు రూపంలో డిపాజిట్ చేస్తే.. ముందుగా ఈ వార్తను చదవండి. డిజిటల్ లావాదేవీలతోపాటు మీ అన్ని ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు నగదు రూపంలో మొత్తాన్ని డిపాజిట్ చేయడంపై ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చే అవకాశం ఉంది..

Income Tax Notice: మీరు కూడా ఈ తప్పు చేశారా?..అయితే ఇప్పుడు మీ ఇంటికి కూడా ఐటీ అధికారులు నోటీసులు పంపుతారు జాగ్రత్త..
Income Tax Notices
Sanjay Kasula

|

Sep 26, 2022 | 5:00 PM

మీరు కూడా పన్ను చెల్లిస్తున్నట్లైతే.. ఈ వార్త మీ కోసమే.. మీ పొరపాట్లలో ఒకదాని కారణంగా.. ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి మీకు కూడా నోటీసు రావచ్చు. వాస్తవానికి, మీ ఆర్థిక లావాదేవీలన్నింటిపై ప్రభుత్వం నిఘా ఉంచుతుంది. మీరు పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే.. మీరు కూడా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చే ఛాన్స్ ఉంది. వాస్తవానికి, ఎవరైనా పెద్ద నగదు లావాదేవీలు చేస్తే ఆదాయపు పన్ను శాఖ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకరేజ్ హౌస్‌లు, ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లకు సమాచారం ఇవ్వాలి. అటువంటి పరిస్థితిలో.. మీరు కూడా డిజిటల్ కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేస్తే.. మీరు కూడా పొరపాటు చేస్తున్నట్లే.. మీకు ఆదాయపు పన్ను శాఖ నోటీసును అందజేసే కొన్ని నగదు లావాదేవీల గురించి తెలుసుకుందాం..

1. ప్రాపర్టీ షాపింగ్ 

మీరు 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని నగదు రూపంలో కొనుగోలు చేసినా లేదా విక్రయించినా దాని గురించి మీకు ఆదాయపు పన్ను శాఖకు చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆదాయపు పన్ను శాఖ మీ నుంచి వివరణ అడిగే అవకాశం ఉంది. మీ నగదు మూలం గురించి కూడా మిమ్మల్ని అడగవచ్చు. 

2. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు 

మీరు క్రెడిట్ కార్డ్ బిల్లును కూడా నగదు రూపంలో డిపాజిట్ చేస్తే.. మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఒకేసారి రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు రూపంలో డిపాజిట్ చేస్తే.. ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని వివరాలు అడుగుతుంది. మీరు ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే.. మీరు దాని మూలాన్ని కూడా అందించాలి. 

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు

మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే లేదా మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు, బాండ్లలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేస్తే జాగ్రత్తగా ఉండండి. ఒక ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే.. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు పొందవచ్చు. 

FDలో నగదు డిపాజిట్ చేయండి

మీరు ఒక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డిపాజిట్ చేస్తే.. ఈ డబ్బు మూలానికి సంబంధించిన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని అడగవచ్చు. మీరు డిజిటల్‌గా మాత్రమే FDలో డబ్బును డిపాజిట్ చేయండి. తద్వారా ఆదాయపు పన్ను శాఖ మీ లావాదేవీల రికార్డును కలిగి ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉండదు.  

బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయవద్దు 

ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మీరు ఒక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తున్నట్లైతే ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా, మీరు ఏదైనా బ్యాంకు లేదా సహకార బ్యాంకులో సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినట్లయితే.. మీరు ఆదాయపు పన్ను శాఖ రాడార్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు ఏదైనా మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకుంటే.. దానిని ఆన్‌లైన్‌లో చేయండి. తద్వారా మీ లావాదేవీ గురించి శాఖకు తెలుస్తుంది. 

ఆదాయపు పన్ను నియమాలు ఇవే..

ఇదిలావుంటే.. దీపావళి సందర్బంలో మీకు ఎవరి నుంచి అయినా మీరు నగదు రూపంలో బహుమతులు తీసుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి  బహుమతులపై కూడా టాక్స్ పడుతుంది. అసలు బహుమతులకు సంబంధించిన నియమాలు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 56(2)లో ఇవ్వబడింది. ఒక కంపెనీ తన ఉద్యోగులకు రూ. 5,000 కంటే తక్కువ బహుమతిగా ఇస్తే.. అది పన్ను పరిధిలోకి రాదు. అదే ఒక సంవత్సరంలో రూ. 5,000 కంటే ఎక్కువ మొత్తంలో కంపెనీ నుంచి బహుమతులు తీసుకున్నట్లైతే ఆ ఉద్యోగికి  తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బహుమతికి బదులుగా ఈ మొత్తాన్ని జీతంలో కలుపుతారు.

బంధువుల నుంచి బహుమతి

పన్ను నిబంధనలలో బంధువులకు నిర్వచనం ఇచ్చారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ బంధువుల్లో ఎవరైనా ఆ నిర్వచనానికి సరిపోతుంటే.. అతను ఇచ్చే ఏదైనా ఖరీదైన బహుమతి పన్ను నుంచి మినహాయించబడుతుంది. ఈ వర్గంలో తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి కానీ.. భర్త లేదా భార్య మాత్రమే వస్తారని గుర్తుంచుకోండి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu