మీ పాత పొదుపు ఖాతాను జన్ ధన్ యోజనకు బదిలీ చేస్తే.. ఈ 10 సౌకర్యాలు పూర్తిగా ఉచితం.. అవేంటో తెలుసా?

జన్ ధన్ ఖాతా పథకం(Jan dhan Yojana) అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీనిలో దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

మీ పాత పొదుపు ఖాతాను జన్ ధన్ యోజనకు బదిలీ చేస్తే.. ఈ 10 సౌకర్యాలు పూర్తిగా ఉచితం.. అవేంటో తెలుసా?
Jan Dhan Yojana Account Government Schemes
Follow us

|

Updated on: Apr 28, 2022 | 7:49 AM

జన్ ధన్ ఖాతా పథకం(Jan dhan Yojana) అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీనిలో దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. జన్ ధన్ యోజన కింద అనేక రకాల ఉచిత సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బ్యాంకుకు భారీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ పాత బ్యాంక్ ఖాతాలలో దేనినైనా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనకు బదిలీ చేస్తే, మీరు కూడా ఈ సౌకర్యాలను పొందవచ్చు. మీరు ఇప్పటికే సేవింగ్స్ బ్యాంక్ ఖాతా(Savings Bank Account) వంటి డిపాజిట్ ఖాతాను కలిగి ఉన్నారని అనుకుందాం.. అప్పుడు మీరు దానిని సులభంగా జన్ ధన్ యోజనకు బదిలీ చేయవచ్చు. జన్ ధన్‌కు బదిలీ చేయాల్సిన డిపాజిట్ ఖాతా ఆ బ్యాంకు రూపే కార్డు(Rupay Card) అయి ఉండాలి. లేని పక్షంలో దరఖాస్తు చేసి తీసుకోవచ్చు. ఆపై జన్ ధన్‌లో ఖాతాను బదిలీ చేయండి.

మీరు ఆపరేట్ చేయలేరని భావించే పొదుపు ఖాతా మీకు ఉంది అనుకుందాం. మినిమమ్ బ్యాలెన్స్ మీకు భారమైనట్లయితే, మీరు దానిని జన్ ధన్ స్కీమ్‌కి బదిలీ చేయవచ్చు. దీనితో మీరు అనేక సౌకర్యాలను ఉచితంగా పొందడం ప్రారంభిస్తారు. దీని కోసం పాత బ్యాంకులో రుసుము చెల్లించాల్సి వస్తుంది. మీరు ఆ పాత బ్యాంకు రూపే కార్డును కలిగి ఉంటే, ఆ రూపే కార్డుతో మీరు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద జీవిత బీమా, ప్రమాద బీమా ప్రయోజనాలను సులభంగా పొందుతారు. ఖాతా బదిలీపై కూడా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఖాతా ఆపరేషన్‌లోనూ ఉంటుంది. దానిపై రుణం డిఫాల్ట్ ఉండకూడదు. జన్‌ధన్‌లో ఖాతాను బదిలీ చేయడానికి అందుబాటులో ఉన్న ఉచిత సౌకర్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • జన్ ధన్ యోజనలో ఇద్దరు కుటుంబ సభ్యులు జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవవచ్చు.
  • జన్ ధన్ ఖాతాలో డబ్బు జమ చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు.
  • సేవింగ్స్ ఖాతా లేదా రూపే డెబిట్ కార్డ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంలో ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ఎలాంటి ఛార్జీలు లేకుండా మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
  • మీరు ఉచిత మినీ స్టేట్‌మెంట్‌ను కూడా పొందుతారు.
  • ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం పథకం కింద అమలు చేస్తోన్న, ఈ పథకంలో పెట్టుబడి గురించి తెలుసుకోవచ్చు.
  • జన్ ధన్ ఖాతాతో రూ. 30,000 ఉచిత లైఫ్ కవర్ ఉంటుంది.
  • జన్ ధన్ ఖాతాతో మీకు రూ. 1 లక్ష ప్రమాద బీమా ఉచితంగా లభిస్తుంది.
  • జన్ ధన్ తెరిచిన తర్వాత, మీరు కూడా సేవింగ్స్ ఖాతాను తెరవాలనుకుంటే, దానికి సంబంధించిన పత్రం లేనట్లయితే, మీరు ఇప్పటికీ చిన్న ఖాతాగా పొదుపు ఖాతాను తెరవవచ్చు.

ఉచిత ప్రమాద బీమా..

జన్ ధన్ యోజనలో తెరిచిన ఖాతాపై రూ. 1 లక్ష ప్రమాద బీమా ఉంది. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బీమా ప్రీమియం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే NPCI ద్వారా జమ అవుతుంది. ప్రస్తుతం రూపే కార్డుపై 0.47 పైసల ప్రీమియం వసూలు చేస్తున్నారు. విశేషమేమిటంటే భార్యాభర్తలు జాయింట్‌లో జన్‌ధన్ ఖాతా తెరిచినట్లయితే, ఇద్దరికీ రూ. 1 లక్ష ప్రమాద బీమా, 30 వేల రూపాయల జీవిత బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇద్దరికీ డబ్బు వస్తుంది. అయితే, ఉమ్మడి ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం (రూ. 5000) ఒక సభ్యునికి మాత్రమే దక్కుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: AP Online: పారిశ్రామికవేత్తలకు గుడ్‌న్యూస్.. ఇకపై అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే..

PM SVANidhi: చిరు వ్యాపారస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం స్వీనిధి పథక కాలం పొడిగింపు

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..