Honda CD-110 Dream: మైలేజ్‌ ఇచ్చే వాహనాలకు భారీ డిమాండ్‌.. హోండా నుంచి మార్కెట్లోకి మరో బైక్‌

Honda CD-110 Dream: ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు పెరిగిపోతుండటంతో మార్కెట్లో ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే వాహనాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మైలేజ్‌ అత్యధికంగా ఇచ్చే ...

Honda CD-110 Dream: మైలేజ్‌ ఇచ్చే వాహనాలకు భారీ డిమాండ్‌.. హోండా నుంచి మార్కెట్లోకి మరో బైక్‌
Follow us

|

Updated on: Feb 21, 2021 | 2:16 PM

Honda CD-110 Dream: ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు పెరిగిపోతుండటంతో మార్కెట్లో ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే వాహనాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మైలేజ్‌ అత్యధికంగా ఇచ్చే బైక్‌ల వైపు ఎదురు చూస్తున్నారు. హోండా నుంచి కూడా మైలేజ్‌ అత్యధికంగా ఇచ్చే బైక్‌ల గురించి తెలుసుకుందాం.

హోండా తన చౌకైన అత్యధిక మైలేజ్‌ ఇచ్చే బైక్‌ హోండా సీడీ110 డ్రీ (Honda CD 110 Dream) బీఎస్‌ 6 మోడల్‌ను ఇప్పటికే మార్కెట్లో విడుదల చేసింది. హోండా సీడీ 110 డ్రీం బీఎస్‌ 6 రెండు వేరియంట్లలో విడుదల చేసింది. బీఎస్‌ 6 ఇంజన్‌తో పాటు బైక్‌తో పాటు మరెన్నో అప్‌డేట్‌ చేయబడింది. ఇది సరికొత్త రూపాన్ని ఇస్తుంది.

ఈ బీఎస్‌ 6 బైక్‌ స్టైలింగ్‌ను హోండా అప్‌డేట్‌ చేసింది. దాని బాడీ వర్క్‌లో స్వల్ప మార్కు ఉంది. ఇవి కాకుండా అప్‌డేట్‌ చేసిన బైక్‌ కొత్త గ్రాఫిక్స్‌, క్రోమ్‌ ఎగ్జాస్ట్‌ షీల్డ్‌, బాడీ కలర్‌ మిర్రర్స్‌, సిల్వర్‌ ఫినిష్‌ అల్లాయ్‌ వీల్స్‌తో వస్తుంది. తన సీటు కూడా 15 మి.మీ పొడవు ఉంటుందని కంపెనీ తెలిపింది.

మైలేజ్‌:

హోండా సీడీ 110 డ్రీమ్‌లో అతిపెద్ద మార్పు దాని ఇంజన్‌లో ఉంది. ఈ బైక్‌లో ఇప్పుడు బీఎస్‌ 6 కంప్లైంట్‌ 109.51 సీసీ, ఫ్యూయల్‌ ఇంజెక్ట్‌ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్‌ 7500 ఆర్‌పీఎమ్‌ వద్ద 8.6 హెచ్‌పీ, 5500 ఆర్‌పీఎమ్‌ వద్ద 9.30 ఎన్‌ఎమ్‌ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌ 4 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది. హోండా యొక్క ఇతర బీఎస్‌6 ద్విచక్ర వాహనాల మాదిరిగానే, సీడీ 110 డ్రీమ్‌ కూడా సైలెంట్‌ స్టార్ట్‌ ఫీచర్‌ కలిగి ఉంటుంది. అయితే లీటర్‌ పెట్రోలుకు రూ.65 నుంచి 70కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది.

ఫీచర్స్‌:

హోండా యొక్క చౌకైన బైక్‌లో ఇంజన్‌ స్టార్ట్‌, స్టాఫ్‌ స్విచ్‌, డీసీ హెడ్‌ ల్యాంప్‌, ఇంటిగ్రేటెడ్‌ హెడ్‌ల్యాంప్‌ బీమ్‌ అండ్‌ పాసింగ్‌ స్విచ్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు, లాంగ్‌ అండ్‌ కంఫర్ట్‌ సీట్‌, సీబీఎస్‌ విత్ సీలర్‌, సీల్‌ చైన్‌ వంటివి ఉన్నాయి.

ధర:

బీఎస్‌ 6 హోండా సీడీ 110 డ్రీమ్‌ బైక్‌ స్టాండర్డ్‌ మరియు డీలక్స్‌ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధర వరుసగా రూ.64,505, రూ.65,505 ఈ ధరలు ఎక్స్‌-షోరూమ్‌.

Also Read: Hydrogen Fuel Car: త్వరలోనే మార్కెట్లోకి రానున్న హైడ్రోజన్‌ కార్లు.. పైలెట్‌ ప్రాజెక్టుగా ఢిల్లీలో ప్రారంభం

తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..