Samsung 5G: 4జీ మొబైళ్లకన్నా తక్కువకే 5జీ స్మార్ట్ ఫోన్లు.. శామ్సంగ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..

శామ్సంగ్ బ్రాండ్ లో వినియోగదారులకు ఉన్న వెసులుబాటు ఏంటంటే రూ. 10,000లోపు స్మార్ట్ ఫోన్లు ఉంటాయి.. అలాగే రూ. 1.50లక్షలకు పైగా కూడా ధర ఉంటే ఫోన్లు ఉంటాయి. అంటే సామాన్యుడి నుంచి కుబేరుల వరకూ శామ్సంగ్ బ్రాండ్ తమ మొబైళ్లను అందివ్వగలుగుతుంది.

Samsung 5G: 4జీ మొబైళ్లకన్నా తక్కువకే 5జీ స్మార్ట్ ఫోన్లు.. శామ్సంగ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..
Samsung Smart Phones
Follow us

|

Updated on: Feb 02, 2023 | 3:00 PM

ఆండ్రాయిడ్ ఫోన్లలో ట్రెండ్ సెట్టర్ శామ్సంగ్. గెలాక్సీ సిరీస్ తో ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించేసింది. ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కంపెనీలు పోటీ పడుతున్నా తన స్థానాన్ని నిలుపుకోగులుతోంది. ఇప్పుడు ప్రపంచం మరింత వేగంగా దూసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. దేశంలో ఎయిర్ టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. ఈ క్రమంలో అందరూ 5జీ సపోర్ట్ చేసే ఫోన్ల కోసం వెతుకుతున్నారు. అయితే వాటి ధరను కూడా బడ్జెట్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి శామ్సంగ్ బెస్ట్ ఆప్షన్ లా కనిపిస్తోంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

తగ్గుతున్న చైనా ఉత్పత్తులు..

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గుల కారణంగా చైనా బ్రాండ్లు దేశంలో కొత్త ఉత్పత్తులను తీసుకురావడాన్ని తగ్గించాయి. ఈ క్రమంలో మన దేశంలో వినియోగదారులకు బడ్జెట్ లెవెల్ లో కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ శామ్సంగ్. ఈ శామ్సంగ్ బ్రాండ్ లో వినియోగదారులకు ఉన్న వెసులుబాటు ఏంటంటే రూ. 10,000లోపు స్మార్ట్ ఫోన్లు ఉంటాయి.. అలాగే రూ. 1.50లక్షలకు పైగా కూడా ధర ఉంటే ఫోన్లు ఉంటాయి. అంటే సామాన్యుడి నుంచి కుబేరుల వరకూ శామ్సంగ్ బ్రాండ్ తమ మొబైళ్లను అందివ్వగలుగుతుంది.

5జీపై దృష్టి..

ఇదే క్రమంలో అత్యాధునిక 5జీ సేవలను అందించే స్మార్ట్ ఫోన్లను శామ్సంగ్ అత్యంత చవకగా అందించేందుకు ప్లాన్ చేస్తోంది. రూ. 20,000 లోపు ధరతో నే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో శామ్సంగ్ తన గెలాక్సీ ఏ సిరీస్ లో ఓ స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. దీనిని మరింత విస్తరించేందుకు ప్రణాళిక చేస్తోంది.

ఇవి కూడా చదవండి

4జీ కన్నా చవకగా 5జీ మొబైల్..

శామ్సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ మాట్లాడుతూ అన్ని ధరలలో తమ మొబైళ్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లో బడ్జెట్, మధ్య స్థాయి, ప్రీమయం ధరలో స్మార్ట్ ఫోన్ ను అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే అత్యంత చవకైన విధంగా అంటే 4జీ కన్నా తక్కువగానే 5జీ సేవలకు అందించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు బబ్బర్ వెల్లడించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..