Smart phones: తక్కువ బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా? రూ. 15,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

మన బడ్జెట్లో మనకు అవసరమైన బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కావాలంటే కొంత రీసెర్చ్ అవసరమే. అందుకే మీకు అలాంటి శ్రమను తగ్గిస్తూ రూ. 15000 లోపు బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీ కోసం అందిస్తున్నాం. మీరు కూడా స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తుంటే. ఈ కథనాన్ని అసలు మిస్ అవ్వొద్దు.

Smart phones: తక్కువ బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా? రూ. 15,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
Budget Smart Phones
Follow us

|

Updated on: Feb 02, 2023 | 2:00 PM

స్మార్ట్ ఫోన్.. ప్రస్తుతం సమాజంలో ఓ నిత్యావసరం! నిజమే మనిషి తన రోజు సమయంలో అత్యధికంగా గడిపేది ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ తోనే. అంతలో మనిషతో అది బంధాన్ని పెనవేసుకొంది. మార్కెట్లో వందల సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా? ఇది పెద్ద టాస్కే. మన బడ్జెట్లో మనకు అవసరమైన బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కావాలంటే కొంత రీసెర్చ్ అవసరమే. అందుకే మీకు అలాంటి శ్రమను తగ్గిస్తూ రూ. 15000 లోపు బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీ కోసం అందిస్తున్నాం. మీరు కూడా స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తుంటే. ఈ కథనాన్ని అసలు మిస్ అవ్వొద్దు. రూ. 15,000లోపు ధరలో బెస్ట్ ఫీచర్లతో ఉన్న ఫోన్లు ఇవే..

రియల్ మీ10 @ 13,999..

మీకు తక్కువ బడ్జెట్ లో మంచి ఫోన్ కావాలనుకునే వారికి రియల్ మీ10 మంచి ఆప్షన్. ఇది రెండు కలర్ ఆప్షన్స్ క్లాష్ వైట్, రష్ బ్లాక్ లలో లభిస్తోంది. ఇది 6.4 అంగుళాల 90 Hz సూపర్ అమోల్డ్ డిస్ ప్లే తో వస్తుంది. దీని సంరక్షణకు గొరిల్లా గ్లాస్ 5 ఉంటుంది. దీనిలో హిలియో G99 చిప్ సెట్ ప్రాసెసర్ అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33W సామర్థ్యం కలిగిన చార్జర్ వస్తుంది. మంచి స్ట్రీమింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్ కు బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్ సైడ్ 50MP డ్యూయల్ కెమెరాతో పాటు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. రియల్ మీ 10 4GB+64GB వేరియంట్ ది రూ. 13,999 , 8GB+128GB వేరియంట్ రూ. 16,999 లభ్యమవుతుంది. రియల్మీ వెబ్ సైట్ లేదా ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.

మోటో జీ72 @ రూ. 14,999..

మోటో జీ72 6.55 ఫుల్ హెచ్డీ ప్లస్ పోలెడ్ డిస్‌ప్లే, 120 Hz స్మూత్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో మీ ఫోన్‌కి సులభంగా యాక్సెస్ చేసే పాకెట్-ఫ్రెండ్లీ రేంజ్‌లో క్లాసీ డిజైన్‌ను కలిగి ఉంది. మీడియా టెక్ హీలియో G99 ప్రాసెసర్, 6GB RAMతో ఫోన్ మీకు శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జర్‌తో కూడిన భారీ 5000mAh బ్యాటరీతో మల్టీటాస్క్ సులభతరం అవుతుంది. ఈ మొబైల్ 108MP ట్రిపుల్ రియర్ కెమెరాతో పాటు 16MP ఫ్రంట్‌ కెమెరాతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ అవకాశం ఇస్తుంది. ఈ ఫోన్ స్టోరేజ్ వేరియంట్‌లో మెటోరైట్ గ్రే, పోలార్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంది. 6GB RAM + 128GB ROM ధర రూ. 14,999 మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ అలాగే ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

పోకో ఎం4 ప్రో @ రూ. 13,999..

పోకో ఎం 4 ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తోంది. 6.6 అంగుళాల 90Hz ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తోంది. మంచి స్ట్రీమింగ్ అనుభవం కోసం అధిక-పనితీరు గల మీడియా టెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌ ఉంటుంది. 5,000 mAh బ్యాటరీతో 140 గంటల సంగీతాన్ని, 40 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. 64MP ట్రిపుల్ రియర్, 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది కూల్ బ్లూ, పవర్ బ్లాక్, ఎల్లో వంటి మూడు కలర్ ఆప్షన్లతో వస్తోంది. 6GB+64GB వేరియంట్ ధర రూ.11,999, 6GB+128GB వేరియంట్ ధర రూ. 12,999, 8GB+128GB వేరియంట్ ధర రూ. 13,999 ఉంది. ఇది ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో అందుబాటులో ఉంది.

రెడ్పీ నోట్ 10ఎస్@ రూ. 12,499..

రెడ్పీ నోట్ 10ఎస్ జియోమీ మంచి లో బడ్జెట్ మొబైల్. ఇది అద్భుతమైన రంగులు, డిజైన్‌లతో వస్తుంది. 6.43 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ95 ప్రాసెసర్ తో సమర్థవంతమైన పనితీరు అందిస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జర్‌తో కూడిన 5,000 mAh బ్యాటరీ అందిస్తుంది. ఈ ఫోన్ లో 64 MP క్వాడ్ కెమెరా సెటప్, 13MP ఫ్రంట్‌ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ కాస్మిక్ పర్పుల్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ వైట్, డీప్ సీ బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. 6GB+64GB వేరియంట్ ధర రూ. 10,999, 6GB+128GB వేరింయట్ ధర రూ. 12,499 , 8GB+128GB వేరియంట్ ధర రూ. 15,499 ఉంది. రెడ్ మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లో అందుబాటులో ఉంది.

ఐక్యూ జెడ్ 44 డబ్ల్యూ @ రూ. 14,499..

ఇది ఆల్-రౌండర్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూసే వారికి మంచి ఎంపిక. 6.44 అంగుళాల FHD+ డిస్ప్లేతో, ఫోన్ మీకు స్నాప్ డ్రాగన్ ఆర్ 680 ప్రాసెసర్‌తో సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. 44W ఫ్లాష్ ఛార్జింగ్‌తో కూడిన శక్తివంతమైన 5,000 mAh బ్యాటరీ మిమ్మల్ని 19.1 గంటల యూట్యూబ్ స్ట్రీమింగ్, 10.1 గంటల BGMI గేమింగ్ చేయడానికి అనుమతిస్తుంది. దీనిలో 8MP సెల్ఫీ కెమెరాతో 50MP వెనుక కెమెరా సెటప్‌ తో వస్తుంది. ఈ ఫోన్ రావెన్ బ్లాక్, లూమినా బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 128GB ధర రూ. 14,499, 6GB RAM + 128GB ధర రూ. 15,999 ఉంది. ఐక్యూ అధికారిక వెబ్‌సైట్ తో పాటు అమెజాన్ లో అందుబాటు లో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..