Gold price: అంతర్జాతీయంగా పసిడి కాంతులు.. బంగారం దూకుడు తగ్గేదేలే…!

|

Sep 24, 2024 | 4:45 PM

ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ మరే ఇతర లోహాలకు లేదు. ప్రతి ఒక్కరూ దీన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. మన దేశంలో అయితే బంగారానికి విపరీతమైన డిమాండ్. సీజన్ తో సంబంధం లేకుండా బంగారు ఆభరణాలను కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. ఇక పండగలు, శుభకార్యాల సమయంలో డిమాండ్ అమాంతంగా పెరుగుతుంది.

Gold price: అంతర్జాతీయంగా పసిడి కాంతులు.. బంగారం దూకుడు తగ్గేదేలే…!
Gold Rate
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ మరే ఇతర లోహాలకు లేదు. ప్రతి ఒక్కరూ దీన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. మన దేశంలో అయితే బంగారానికి విపరీతమైన డిమాండ్. సీజన్ తో సంబంధం లేకుండా బంగారు ఆభరణాలను కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. ఇక పండగలు, శుభకార్యాల సమయంలో డిమాండ్ అమాంతంగా పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు తమ పొదుపు పై బంగారంపై వెచ్చిస్తారు. బంగారు ఆభరణాలను విరివిరిగా కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో బంగారం ధర ఎప్పడూ పెరుగుతూనే ఉంది. కొన్ని పరిస్థితుల్లో కొంచె తగ్గనప్పటికీ అది రోజుల్లోనే ఉంటుంది. మళ్లీ యథాతథంగా ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం బంగారం ధర రికార్డు స్థాయిలో ఉంది. ఇది కొనసాగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గరిష్ట స్థాయి రికార్డు

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై అంచనాలు రావడంతో బంగారం ధరలు ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరువలో ఉన్నాయి. డాలర్ బలహీనమవ్వడంతో బంగారం కొనుగోలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం ధర డాలర్లలో ఉంటుంది. డాలర్ బలహీనమైనప్పుడు, ఫెడ్ రేట్లను తగ్గించినప్పుడు బంగారాన్ని ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి అవకాశం కలుగుతుంది. బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాల నేపథ్యంలో బంగారం రికార్డు లు నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జౌన్స్ 2621.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరుకుంది. ఒక జౌన్స్ 2,625.11 డాలర్లకు చేరింది. ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ ఇటీవల జరిగిన సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్, డిసెంబర్ లలో జరిగే సెంట్రల్ బ్యాంక్ పాలసీ సమావేశాలలో క్వార్టర్ పాయింట్ కోతలను వెనక్కి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

పసిడి కాంతులు

డాలర్ బలహీనం, ఫెడ్ కోతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి కాంతులు విరబూస్తున్నాయి. నిపుణులు మార్కెట్ స్థితిని ఎప్పటి కప్పుడు గమనిస్తున్నారు. ఈ ఏడాది మన దేశంలో స్పాట్ గోల్డ్ ధరలు దాదాపు 16 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా అది 24 శాతానికి చేరుకుంది. బంగారం ధరను సాధారణంగా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రపంచంలోని భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కూడా దీనికి కీలకంగా మారతాయి. త్వరలో జరిగే యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వార్తలు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం, గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులు ఇలా అంశాలు దీని చుట్టూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో..

దేశంలో బంగారం ధరలు పుంజుకున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీ నాటికి తూలం బంగారం సుమారు రూ. 1 7వందలు పెరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబైలలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.69,800లకు, 24 క్యారెట్లు రూ.76,150కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 69,950, అలాగే 24 క్యారెట్లు రూ.76,300 పలుకుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..