Banks Privatization: బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో లేనట్లేనా? ఇది సమ్మె ఎఫెక్టేనా?

బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. నిజానికి వ్యవసాయ చట్టాలపై రైతుల పట్టుదలతో ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అప్పటి నుంచి సంస్కరణలు, ప్రైవేటీకరణ బాటలో ప్రభుత్వం ఆచి..తూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

Banks Privatization: బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో లేనట్లేనా? ఇది సమ్మె ఎఫెక్టేనా?
Banks Privitization
Follow us

|

Updated on: Dec 16, 2021 | 6:59 PM

Banks Privatization: బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. నిజానికి వ్యవసాయ చట్టాలపై రైతుల పట్టుదలతో ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అప్పటి నుంచి సంస్కరణలు, ప్రైవేటీకరణ బాటలో ప్రభుత్వం ఆచి..తూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రభుత్వం బిల్లు తీసుకురావాల్సి ఉండగా ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం దీనిని తెచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వ బ్యాంకులు లేదా పీఎస్‌బీల ప్రైవేటీకరణను బ్యాంకు ఉద్యోగుల సంస్థలు నిరంతరం వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయమై బ్యాంకు ఉద్యోగుల సంఘాలు గతంలో పలుమార్లు సమ్మెకు దిగాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో డిసెంబర్ 16, 17 తేదీల్లో అంటే ఈరోజు, రేపు బ్యాంకులను మూసివేస్తున్నట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. ఆమేరకు సమ్మె మొదలు పెట్టాయి.

వ్యవసాయ చట్టాల్లో చీలిక తర్వాత, ఈ పార్లమెంట్ సమావేశాల్లో బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించిన బిల్లును ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి హామీ ఇచ్చినప్పటికీ, బ్యాంకుల కార్మిక సంఘాలను ఒప్పించలేకపోతోంది. సమ్మె వాయిదా వేయాలని కార్మిక సంఘాలను కోరినా అవి సమ్మె బాట వీడలేదు. రెండు రోజుల సమ్మెలో మొదటి రోజైన గురువారం బ్యాంకుల పనితీరుపై తీవ్ర ప్రభావం పడింది.

నివేదికల ప్రకారం, ఒక్క మహారాష్ట్రలోనే 60,000 మందికి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఈ సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యాపారాలు కుదేలయ్యాయి.

దేశవ్యాప్తంగా ఎన్ని శాఖలు మూతపడ్డాయంటే..

బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ) వైస్ ప్రెసిడెంట్ జోయ్‌దేబ్ దాస్‌గుప్తా మనీ9తో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,20,000 (ఒక లక్ష ఇరవై వేల) శాఖలు మూతపడ్డాయని, 11.5 లక్షల మంది బ్యాంకుల ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును ప్రభుత్వం ఇంతవరకు సమర్పించనప్పటికీ, అది జాబితాలో ఉందని దాస్‌గుప్తా చెప్పారు. బ్యాంకుల ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందని దాస్‌గుప్తా చెప్పారు.

సహజంగానే, బ్యాంకుల పని ఇంత పెద్ద ఎత్తున నిలిచిపోతే, సామాన్య ప్రజల నుండి వ్యాపారవేత్తల వరకు బ్యాంకింగ్ సంబంధిత పని తీవ్రంగా దెబ్బతింటుంది. దీని కారణంగా చెక్ క్లియరెన్స్, ATM సేవలతో సహా బ్యాంకింగ్‌కు సంబంధించిన ప్రతి చిన్న.. పెద్ద పని దెబ్బతింటుంది. ప్రభుత్వ పరంగా చూస్తే, బ్యాంకింగ్ బిల్లులో నిలిచిపోయినట్లు కనిపించడమే కాకుండా, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన బిల్లు కూడా వాయిదా పడింది. మొత్తమ్మీద రైతుల విషయంలో ఇరకాటంలో పడిన ప్రభుత్వం ఇప్పుడు ప్రతి కొత్త సంస్కరణపై ఆచి తూచి అడుగులు వేస్తోంది.

ఇవి కూడా చదవండి:  Bigg boss 5 Telugu: కంటెస్టెంట్స్‌ను ఆటపట్టించిన బిగ్ బాస్.. హౌస్‌లో విరబూసిన నవ్వులు

Gadget Guru: ఇది లేకుంటే మీ బ్యాంక్ ఖాతా గుల్లే.. ఇవి షేర్ చేయకుండా ఉంటె బెటర్..(వీడియో)

Sheena Bora Case: షీనా బోరా మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌.. CBIకి ఇంద్రాణి సంచలన లేఖ