Gold Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్‌న్యూస్‌.. తాజా పసిడి ధరల వివరాలు..!

Gold Price Today: మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? ఇదే మంచి అవకాశం. గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో..

Gold Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్‌న్యూస్‌.. తాజా పసిడి ధరల వివరాలు..!
Follow us

|

Updated on: Dec 08, 2021 | 5:51 AM

Gold Price Today: మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? ఇదే మంచి అవకాశం. గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టడగా, కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉంది. ఇక ముంబైలో మాత్రం 10 గ్రాముల బంగారంపై రూ.310 నుంచి రూ.350 వరకు ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో స్థిరంగా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీగానే తగ్గింది. ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారం (డిసెంబర్‌ 8)న దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఒక వేళ తగ్గవచ్చు.. లేదా పెరగొచ్చు.

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,910 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,170 వద్ద ఉంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,820 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,820 వద్ద కొనసాగుతోంది.

* ఇక తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.

* ఇక పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది.

* అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది.

* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది.

* అలాగే ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది.

* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Samsung Galaxy A03 Core: తక్కువ ధరలో శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్స్‌ వివరాలు!

Income Tax Return: ఆదాయపు పన్ను రిటర్న్‌లు త్వరగా దాఖలు చేయండి: ఐటీ శాఖ