Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..?

Gold Price Today: దసరా, దీపావళి, పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. ఈ సెంటిమెంట్ కారణంగా.. భారతదేశంలో బంగారం

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..?
Follow us

|

Updated on: Oct 04, 2021 | 5:58 AM

Gold Price Today: దసరా, దీపావళి, పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. ఈ సెంటిమెంట్ కారణంగా.. భారతదేశంలో బంగారం కొనుగోళ్లు జోరుగా పెరుగుతాయి. భారత్‌లో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర సోమవారం కూడా స్వల్పంగా పెరిగింది. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా సోమవారం (అక్టోబర్‌ 4) దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 పెరిగింది. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో సోమవారం ధరల వివరాలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,720 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,870 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490 ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,870 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,570 ఉంది.

అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,470 ఉంది.

పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Lakhimpur Kheri clash: ‘నా కొడుకు కారులో లేడు.. ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు’ : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా

Lakhimpur Kheri clash: లఖింపూర్ ఖేరీ ఘటన దురదృష్టకరం.. బాధ్యులపై కఠిన చర్యలు : సీఎం యోగి ఆదిత్యానాధ్‌

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..