Free airport lounge: మీ క్రెడిట్ కార్డుతో ఎయిర్‌పోర్టులో ఫ్రీ సర్వీసులు.. ఆఫర్ ఏంటంటే?

ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అలాగే క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకుల మధ్య పోటీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్ల ప్రకటిస్తున్నాయి. సాధారణంగా కస్టమర్లకు రివార్డు పాయింట్లు అందజేస్తాయి. అలాగే వివిధ పండగల సమయంలో కొనుగోలుపై ఆఫర్లు అందజేస్తాయి.

Free airport lounge: మీ క్రెడిట్ కార్డుతో ఎయిర్‌పోర్టులో ఫ్రీ సర్వీసులు.. ఆఫర్ ఏంటంటే?
Follow us

|

Updated on: Sep 24, 2024 | 3:45 PM

ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అలాగే క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకుల మధ్య పోటీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్ల ప్రకటిస్తున్నాయి. సాధారణంగా కస్టమర్లకు రివార్డు పాయింట్లు అందజేస్తాయి. అలాగే వివిధ పండగల సమయంలో కొనుగోలుపై ఆఫర్లు అందజేస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు తీసుకున్న ఖాతాదారులకు ఫ్రీ ఎయిర్ పోర్టు లాంజ్ సౌకర్యం కల్పిస్తాయి. ఈ ఆఫర్ మీ క్రెడిట్ కార్డుకు ఉందో, లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  విమానాశ్రయంలో ప్రయాణికులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో వారికి కోసం ఎయిర్ పోర్టులలో లాంజ్ లు ఉంటాయి. వీటిలో ఆహారం, డ్రింక్స్, స్పా తదితర అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఫ్రీ ఎయిర్ పోర్టు లాంజ్ యాక్సెస్ ఉన్నవారు ఆ సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి క్రెడిట్ కార్డులో ఆ సౌకర్యం ఉందేమో ముందు నిర్ధారణ చేసుకోవాలి. ప్రయాణం సమయంలో విమానాశ్రయంలో వేచి ఉండేటప్పుడు ఈ సర్వీస్ ను ప్రయాణికులు వినియోగించుకోవచ్చు.

మీ క్రెడిట్ కార్డుతో లభిస్తున్న ప్రయోజనాల బుక్‌లెట్ ను లేదా మాన్యువల్‌ను పరిశీలించండి. దానిలో మీకు అందించే అన్ని రకాల ఆఫర్ల వివరాలు ఉటాయి. ఆ కార్డుకు లింక్ చేసిన కొన్ని విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్ ఉంటుంది. క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకు వెబ్‌సైట్‌ ను పరిశీలించాలి. మీ కార్డు పై ఇస్తున్న ఆఫర్లు, రివార్డ్‌లకు సంబంధించిన విభాగానికి వెళ్లండి. దానిలో అన్ని వివరాలు ఉంటాయి. క్రెడిట్ కార్డు వెనుకభాగంగా కస్టమర్ సర్వీస్ హాట్ లైన్ నంబర్లు ఉంటాయి. వాటిని సంప్రదిస్తే మీ కార్డుకు సంబంధించి అన్ని వివరాలు తెలియజేస్తారు. కొన్ని కార్డులకు ప్రయారిటీ పాస్, పాస్, లాంజ్‌కీ, సొంత లాంజ్ తదితర నిర్ధిష్ట ప్రోగ్రామ్ లకు అనుమతి కలిగి ఉంటాయి. మీ కార్డు వాటిలో ఏ ప్రోగ్రామ్ కు లింక్ చేశారో నిర్ధారించుకోవాలి.

మీ కార్డ్ లాంజ్ యాక్సెస్‌ను అందిస్తే మీరు నిరభ్యంతరంగా సేవలను వినియోగించుకోవచ్చు. మీరు ప్రాధాన్యత పాస్ వంటి ప్రోగ్రామ్‌ల కోసం ప్రత్యేకమైన మెంబర్‌షిప్ కార్డును పొందవచ్చు. మీకు ఏవైనా అదనపు కార్డులు ఇచ్చారో కూడా తెలుసుకోండి. కాంప్లిమెంటరీ లాంజ్‌ని యాక్సెస్ చేయడం కోసం ముందుగా విమానాశ్రయం రిసెప్షన్‌లో విచారణ చేయండి. మీ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని చెప్పాలి. అవసరమైన వివరాలు నమోదు చేయాలి. కన్వీనియన్స్ ఫీజు చెల్లించి, మీ బోర్డింగ్ పాస్‌ను స్టాంప్ చేయండి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపును స్వీకరించండి, విమానాశ్రయ లాంజ్ పెర్క్‌ల ప్రయోజనం పొందవచ్చు. లాంజ్ యాక్సెస్ ఖర్చు అనేది ఎయిర్‌లైన్‌పై నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. సాధారణంగా ఒక్కో సందర్శనకు రూ. వెయ్యితో ప్రారంభమవుతుంది. ఎయిర్ పోర్టు లాంజ్ పాస్ అనేది ఖాతాదారులకు ఒక కంప్లిమెంటరీ. అనేక క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఈ ఆఫర్ ను అందజేస్తున్నాయి. మీరు తీసుకున్న కార్డులో ఈ ఫీచర్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..