LIC IPO: ఎల్ఐపీ ఐపీవో అప్లై చేసినవారికి షాక్.. షేర్లు పొందేవారికి నష్టం తప్పదా..! ఇక్కడ చెక్ చేసుకోండి..

LIC IPO: ఎల్ఐపీ ఐపీవో అప్లై చేసినవారికి షాక్.. షేర్లు పొందేవారికి నష్టం తప్పదా..! ఇక్కడ చెక్ చేసుకోండి..
Lic Ipo

LIC IPO: ఎల్ఐసీ ఐపీవో లిస్టింగ్ కు(LIC Listing) ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే అప్లై చేసిన వారికి కేటాయింపులు కూడా జరిగిపోయాయి. ఎల్ఐసీ షేర్ల కోసం అప్లై చేసినవారికి అప్పర్ బ్యాండ్ ధర అయిన రూ.949కి షేర్ల కేటాయింపు జరిగినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం తెలుస్తోంది.

Ayyappa Mamidi

|

May 13, 2022 | 5:03 PM

LIC IPO: ఎల్ఐసీ ఐపీవో లిస్టింగ్ కు(LIC Listing) ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే అప్లై చేసిన వారికి కేటాయింపులు కూడా జరిగిపోయాయి. ఎల్ఐసీ షేర్ల కోసం అప్లై చేసినవారికి అప్పర్ బ్యాండ్ ధర అయిన రూ.949కి షేర్ల కేటాయింపు జరిగినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. షేరు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఈనెల 17న లిస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీవో ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.20,500 కోట్లు లభించనున్నాయి. ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటంటే.. ఇష్యూ ధర కంటే తక్కువ రేటుకు ఈ షేర్ లిస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే షేర్లు పొందిన వారికి ఆరంభంలోనే నష్టాలు చవిచూసే పరిస్థితి కనిపిస్తోంది. గ్రే మార్కెట్ ప్రీమియం వివరాల ప్రకారం ఈ విషయం అర్ధమౌతోంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం ఎల్ఐసీ గ్రే మార్కెట్ ప్రీమియం రూ.25 డిస్కౌంట్ లో.. అంటే కంపెనీ ప్రజలకు షేర్లు అమ్మిక ధరలో కోత కనిపిస్తోంది. ఈ లెక్కన కంపెనీ షేర్లు నష్టాల్లో లిస్ట్ అవనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకోవటం, స్టాక్ మార్కెట్లలో ఎక్కువ ఓలటాలిటీ ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. కేవలం పదిరోజుల కాలంలో గ్రే మార్కెట్ ప్రీమియం ఆవిరైపోయింది. దీని వల్ల ఆరంభ లాభాల కోసం షేర్లు కొన్న వారికి ఇది ఒక చేదు వార్తగానే చెప్పుకోవాలి.

మీకు షేర్లు ఎలాటయ్యాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..

  •  షేర్లు మీకు ఎలాట్ అయ్యాయా లేదా అనే వివరాలు  www.kfintech.com లేదా BSE వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
  • kfintech వెబ్‌సైట్‌లో IPO కేటాయింపు వివరాలు తెలుసుకోవాలంటే.. వెబ్‌సైట్‌లోని LIC IPO ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ నంబర్, క్లయింట్ ID లేదా PAN ID వివరాలు ఎంటర్ చేయాలి.
  • అప్లికేషన్ బార్ లోని ASBA ఆప్షన్ ఎంచుకోండి. ఆ తరువాత అక్కడ అడిగిన వివరాలు నింపి.. క్యాప్చా వివరాలు పూరించి సబ్మిట్ బటన్ నొక్కండి.
  • BSE వెబ్‌సైట్‌లో ఇష్యూ టైప్‌కి వెళ్లి ఈక్విటీపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇష్యూ పేరులో ఎల్‌ఐసి ఇండియా లిమిటెడ్‌ను ఎంచుకోండి. ఇప్పుడు అప్లికేషన్ వివరాలు పూరించండి.
  • ఆ తర్వాత.. పాన్ కార్డ్‌ వివరాలు ఎంటర్ చేసి.. I am not a robotపై క్లిక్ చేయండి.

ఒకవేళ మీకు ఎల్ఐసీ షేర్లు ఎలాట్ కాకపోతే..  మీరు చెల్లించిన సొమ్ము మీ రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాలోకి తిరిగి వస్తాయి. ఐపీవోలో షేర్లు ఎలాట్ కాని వారు లిస్టింగ్ తరువాత సరసమైన ధరకు లభిస్తే కొనుక్కోవచ్చు. ప్రస్తుతం ఉన్న సమయంలో ఎక్కువ సంఖ్యలో ఐపీవోలు రావటం వల్ల వీటికి క్రేజ్ కూడా కొంత తగ్గుతోంది. కానీ.. ఎల్ఐసీ దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ కావటం వల్ల ఎక్కువ మంది దీనిలో పార్టిసిపేట్ చేశారు.

ఇవీ చదవండి..

Tata Nexon EV: టాటా నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 437 కిలోమీటర్లు..

Elon Musk: ట్విట్టర్‌ డీల్‌‌లో తాత్కాలికంగా బ్రేక్.. కీలక ప్రకటన చేసిన ఎలన్‌ మస్క్‌

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu