Ola electric bike: ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఎప్పుడు విడుదలవుతుందో తెలుసా..?

దేశంలో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా రకరకాల మోడళ్లలో, అనేక ప్రత్యేకతలతో కనువిందు చేస్తున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా సర్రుమంటూ దూసుకుపోతున్నాయి. దాదాపు అన్ని ద్విచక్ర వాహనాల కంపెనీలు ఈ ఎలక్ట్రిక్‌ టూ వీలర్లను తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఓలా కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఎంతో ఆదరణ ఉంది.

Ola electric bike: ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఎప్పుడు విడుదలవుతుందో తెలుసా..?
Ola Ev Bike
Follow us
Srinu

|

Updated on: Feb 04, 2025 | 4:30 PM

మార్కెట్‌లో ఓలా వాటా దాదాపు 25 నుంచి 30 శాతం వరకూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఓలా వ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌ ఓ శుభవార్త చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీ ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ను విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల విషయాన్ని వ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌ లో పంచుకున్నారు. ఆ బైక్‌ ను ఫిబ్రవరి 5న అధికారికంగా విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఇది ఈవీ మార్కెట్‌ లో విప్లవమని, దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తదుపరి దశ తమ కొత్త ఉత్పత్తితో మొదలవుతుందన్నారు. గతంలో తాము సాధించిన మైలురాళ్లును కొత్త బైక్‌ అధిగమిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్‌ బైక్‌ ను నడుపుతున్న వీడియోను సైతం అగర్వాల్‌ పోస్టు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 10.30 గంటలకు రెడీగా ఉండాలని కోరారు. ఆ బైక్‌ కు సంబంధించిన చిత్రాలను కూడా పంచుకుంటున్నారు.

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్‌ తన మార్కెట్‌ లీడర్‌ స్థానాన్ని తిరిగి పొందినట్టు ఇటీవల ప్రకటించింది. ఒక్క జనవరిలోనే 22,656 యూనిట్లను నమోదు చేసి ముందుకు దూసుకుపోయింది. గత నెలతో పోల్చితే 65 శాతం వృద్ధిని సాధించింది. ఎస్‌ 1 పోర్టు పోలియో, దేశంలో 4 వేల స్థానాలకు విక్రయాలు, సేవా నెట్‌ వర్క్‌ ను విస్తరించడం తదితర కారణాలతో ఓలా మార్కెట్‌ వాటా ఇప్పుడు 25 శాతానికి చేరింది. 2024 జనవరి 31వ తేదీ ఓలా నుంచి ఎస్‌1 బ్రాండ్‌ నుంచి 8 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు విడుదలయ్యాయి. వీటిని జనరేషన్‌ 3 ప్లాట్‌ ఫాంలో విడుదల చేయడం విశేషం. వీటి ధరలను రూ.79,999 నుంచి రూ.1,69,999గా నిర్ధారణ చేశారు. కాగా.. జెన్‌ 3 స్కూటర్లతో తమ సమర్థత, పనితీరు, భద్రత, విశ్వసనీయత మరింత పెరుగుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ విభాగంలో ఓలా సంస్థ నంబర్‌ వన్‌ అని చెప్పవచ్చు. ఈ కంపెనీ తయారు చేసిన స్కూటర్లకు మార్కెట్‌ లో ఎంతో డిమాండ్‌ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ బైక్‌ విభాగంలోనూ సత్తా చాటాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా వ్యవస్థాపకులు భవీష్‌ అగర్వాల్‌ తమ కొత్త బైక్‌ చిత్రాలను ఎక్స్‌ లో పోస్టు చేశారు. ఓలా కంపెనీ హెడ్‌ క్వార్టర్‌ బెంగళూరులో ఉండగా, మ్యాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ మాత్రం తమిళనాడుతో ఏర్పాటు చేశారు. అక్కడ తయారైన స్కూటర్లను దేశం వ్యాప్తంగా విక్రయిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..