దసరా జోరు.. దీపావళి బేజారు!

దీపావళి దగ్గర పడుతోంది. అందరినీ ఆకర్షించేందుకు షాపింగ్ మాల్స్‌తో పాటు ఈ-కామర్స్ సంస్థలు, అటు బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లను ఇస్తున్నాయి. మరోవైపు బంగారం ధరలు కూడా ఈ మధ్యకాలంలో పడిపోతున్నాయి. దీంతో ఈ సారి మార్కెట్లలో జోరు ఉంటుందని అందరూ ఊహించారు. అయితే ఆ జోరు మాత్రం వినియోగదారుల్లో కనిపించడం లేదు. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా.. వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తిని చూపడం లేదు. దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్స్, వాహనాలు ఇలా ప్రతి వస్తువు […]

దసరా జోరు.. దీపావళి బేజారు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 22, 2019 | 2:42 PM

దీపావళి దగ్గర పడుతోంది. అందరినీ ఆకర్షించేందుకు షాపింగ్ మాల్స్‌తో పాటు ఈ-కామర్స్ సంస్థలు, అటు బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లను ఇస్తున్నాయి. మరోవైపు బంగారం ధరలు కూడా ఈ మధ్యకాలంలో పడిపోతున్నాయి. దీంతో ఈ సారి మార్కెట్లలో జోరు ఉంటుందని అందరూ ఊహించారు. అయితే ఆ జోరు మాత్రం వినియోగదారుల్లో కనిపించడం లేదు. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా.. వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తిని చూపడం లేదు. దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్స్, వాహనాలు ఇలా ప్రతి వస్తువు మీద డిస్కౌంట్లు ఇచ్చినప్పటికీ.. వారు అనుకున్నంత రేంజ్‌లో కొనుగోళ్లు జరగట్లేదు.

అయితే ఇదే నెల మొదట్లో దసరా వచ్చి వెళ్లింది. అప్పుడు కూడా ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. ఈ క్రమంలో మార్కెట్లో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. కానీ దసరాతో పోలిస్తే దీపావళికి మాత్రం అనుకున్నంత అమ్మకాలు మాత్రం జరగడం లేదట. అంతేకాదు దీపావళికి పేల్చే టపాసుల అమ్మకాల్లోనూ జోరు కనిపించడం లేదట. అయితే దీనికి కారణాలు కూడా లేకపోలేదు. దసరా అక్టోబర్ నెలారంభంలో వచ్చింది. అది జీతాలు వచ్చే సమయం కాబట్టి.. కొనుగోళ్లు కూడా బాగా జరిగాయి. కానీ ఇప్పుడు నెలాఖరి కావడంతో అందరి జేబులు నిండుకొన్నాయి. దీంతోనే ఎన్ని ఆఫర్లున్నా వస్తువులను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపట్లేదన్నది బిజినెస్ విశ్లేషకుల మాట.