Maruti Suzuki: మారుతి సుజుకీకి రూ.200 కోట్ల జరిమానా.. 30 రోజుల్లోగా డిపాజిట్‌ చేయాలని ఆదేశం.. ఎందుకంటే..!

Maruti Suzuki: భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీకి ఎదురు దెబ్బ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 27 మిలియన్..

Maruti Suzuki: మారుతి సుజుకీకి రూ.200 కోట్ల జరిమానా.. 30 రోజుల్లోగా డిపాజిట్‌ చేయాలని ఆదేశం.. ఎందుకంటే..!
Maruti Suzuki
Follow us

|

Updated on: Aug 23, 2021 | 8:23 PM

Maruti Suzuki: భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీకి ఎదురు దెబ్బ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 27 మిలియన్ డాలర్ల(రూ.200 కోట్ల) జరిమానా విధించింది. 2019లో మారుతి తన డీలర్లను వారు అందించే డిస్కౌంట్లను పరిమితం చేయాలని బలవంతం చేస్తుందనే వచ్చిన ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పరిశీలిస్తోంది. అయితే ఈ ఒత్తిడి లేకపోతే వినియోగదారులకు మరింత మేలు కలుగుతుందని సీసీఐ పేర్కొంది. గతంలో ఈ విషయంపై మాట్లాడిన మారుతి సుజుకి.. తాము ఇలా ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని పేర్కొంది.

మారుతి సుజుకీ చర్య వల్ల డీలర్ల మధ్య పోటీని సమర్థవంతంగా అణచివేస్తుంది. డీలర్లు స్వేచ్ఛగా పనిచేస్తే వినియోగదారులు తక్కువ ధరలకు కార్లను పొందే అవకాశం ఉంటుందని రాయిటర్స్ నివేదించింది. అయితే దర్యాప్తు తర్వాత సీసీఐ ఓ ఉత్తర్వు జారీ చేసింది. ఇందులో ఇక నుంచి అటువంటి విధానాలకు పాల్పడవద్దని తెలిపింది. అలాగే విధించిన ఈ జరిమానాను 30 రోజుల్లోగా డిపాజిట్‌ చేయాలని కంపెనీని కోరింది. ఈ విషయంపై మారుతి సుజుకీ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. దీంతో మారుతి సుజుకీ షేర్లు నేడు పడిపోయి బిఎస్ఈలో రూ. 6,835.00(0.23 శాతం) వద్ద ఉన్నాయి.

కాగా, దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మొత్తం ఉత్పత్తి సంవత్సరానికి 58 శాతం పెరిగి 1,70,719 యూనిట్లకు చేరుకుంది. ఏడాది క్రితం కాలంలో కంపెనీ మొత్తం 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసిందని మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. రద్దయిన పాలసీలను పునరుద్దరించేందుకు ఆలస్య రుసుములో మినహాయింపు!

Vodafone Idea: అప్పుల్లో కూరుకుపోతున్న వొడాఫోన్‌ ఐడియా.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం అవుతుందా..?

Central Government: కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం.. మౌలిక వసతులను విక్రయించేందుకు రంగం సిద్దం..!

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..