Kia discount: కియా కార్లపై బంపర్ ఆఫర్.. ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ ప్రకటన

ప్రస్తుతం కార్ల మార్కెట్ లో ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. వివిధ కంపెనీలు పోటాపోటీగా తగ్గింపులు ప్రకటిస్తున్నాయి. పలు మోడళ్లను తగ్గింపు ధరలకే విక్రయిస్తున్నాయి. 2024వ సంవత్సరం మరో 15 రోజుల్లో ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో సంవత్సరాంతపు డిస్కౌంట్లను కార్ల తయారీదారులు ప్రకటించారు. తమ స్టాక్ ను క్లియర్ చేసుకునేందుకు తగ్గింపులు అందిస్తున్నారు.

Kia discount: కియా కార్లపై బంపర్ ఆఫర్.. ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ ప్రకటన
Kia Cars
Follow us
Srinu

|

Updated on: Dec 14, 2024 | 3:45 PM

మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్ ఇప్పటికే ఈ దారిలో నడుస్తున్నాయి. తాజాగా కియా మోటార్స్ కూడా వచ్చింది. ఆ కంపెనీకి చెందిన సోనెట్, సెల్టోస్, కేరెన్స్ కార్లపై డిస్కౌంట్ అందిస్తోంది. మన దేశంలో పండగల సీజనలో వాహనాలు విక్రయాలు జోరుగా సాగుతాయి. వినాయక చవితి, దసరా, దీపావళి సమయంలో వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఈ సంప్రదాయం చాాలా ఏళ్లుగా వస్తోంది. ఇటీవల ముగిసిన దీపావళి సీజన్ లో కొనుగోలుదారులతో కార్ల మార్కెట్ కిటకిటలాడింది. పలు కంపెనీలు డిస్కౌంట్లను ప్రకటించడంతో అమ్మకాలు చాలా బాగా జరిగాయి. అనంతరం మార్కెట్ సాధారణ పరిస్థితికి చేరింది. ప్రస్తుతం మళ్లీ సంవత్సరాంతపు డిస్కౌంట్లు ప్రకటించడంతో జోరందుకుంటోంది. ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను అమ్మకాలు బాగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

  • కియా కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్లు వివిధ మోడళ్లపై వేర్వేరుగా ఉన్నాయి. సోనెట్ కారుకు సంబంధించి ఎక్స్చేంజ్ బోనస్ అందుబాటులో లేదు. అయినా డీలర్ స్థాయి తగ్గింపులతో పాటు రూ.పది వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.
  • సెల్టోస్ కారుపై రూ.40 వేల ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. మరో రూ.15 వేల కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఢిల్లీ లో మొదటి ఏడాదికి రూ.1 తోనే సమగ్ర బీమా పొందుతారు.
  • కేరెన్స్ మోడల్ పై రూ.15 వేల కార్పొరేట్ తగ్గింపుతో పాటు ఐదేళ్ల వారంటీ ప్యాకేజీ లభిస్తుంది.
  • కియా కార్లకు మన దేశ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కంపెనీ అనేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కియా సెల్టోస్ ను నవీకరణ చేయనుంది. సరికొత్త డిజైన్, కొత్త ఇంటీరియర్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనుంది. నవీకరణ చేసిన కారు వచ్చే ఏడాది మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.
  • కియా కంపెనీ నుంచి త్వరలో సిరోస్ ఎస్ యూవీ విడుదల కానుంది. పనోరమిక్ సన్ రూఫ్, ఏడీఏఎస్, టెర్రైన్ మోడ్ లు, వైర్ లెస్ చార్జింగ్ తదితర ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఈ కారు డిసెంబర్ 19న దేశంలో విడుదల అవుతుందని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కియా కార్లపై బంపర్ ఆఫర్.. ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ ప్రకటన
కియా కార్లపై బంపర్ ఆఫర్.. ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ ప్రకటన
రైతులు, యువత హక్కులను కాలరాస్తున్నారుః రాహుల్
రైతులు, యువత హక్కులను కాలరాస్తున్నారుః రాహుల్
ఇంటర్‌ సిలబస్, పరీక్షల విధానం మారుతుందోచ్‌.. ఎప్పట్నుంచంటే?
ఇంటర్‌ సిలబస్, పరీక్షల విధానం మారుతుందోచ్‌.. ఎప్పట్నుంచంటే?
2024 విడుదలైన బడా సినిమాల్లో డిజాస్టర్స్‌గా నిలిచిన మూవీస్ ఇవే.
2024 విడుదలైన బడా సినిమాల్లో డిజాస్టర్స్‌గా నిలిచిన మూవీస్ ఇవే.
ఇక్కడ టమోటా ధరను మీరు అస్సలు ఊహించలేరు.! వీడియో..
ఇక్కడ టమోటా ధరను మీరు అస్సలు ఊహించలేరు.! వీడియో..
ఇంటి తాళం చాలామంది చెప్పుల స్టాండ్‌లో పెడుతారు.. జాగ్రత్త అండోయ్
ఇంటి తాళం చాలామంది చెప్పుల స్టాండ్‌లో పెడుతారు.. జాగ్రత్త అండోయ్
మూడు చక్రాల బుల్లికారు.. ఒక్కసారి 200 కిలోమీటర్ల మైలేజ్..!
మూడు చక్రాల బుల్లికారు.. ఒక్కసారి 200 కిలోమీటర్ల మైలేజ్..!
'అందమైన ప్రేమకు ఆరేళ్లు'.. ప్రియుడితో జబర్దస్త్ ఫైమా ఫొటో షూట్
'అందమైన ప్రేమకు ఆరేళ్లు'.. ప్రియుడితో జబర్దస్త్ ఫైమా ఫొటో షూట్
ఈ అమావాస్యరోజున ఈ పరిహారాలు చేయండి.. జీవితంలో కష్టాలు ఉండవు..
ఈ అమావాస్యరోజున ఈ పరిహారాలు చేయండి.. జీవితంలో కష్టాలు ఉండవు..
ఈ టైమ్‌లో అరటిపండు అస్సలు తినకండి.! నిపుణుల సలహా ఏంటంటే.?
ఈ టైమ్‌లో అరటిపండు అస్సలు తినకండి.! నిపుణుల సలహా ఏంటంటే.?