BSNL New Plans: రోజుకు రూ.9తో అన్‌లిమిటెడ్ కాల్స్.. అత్యంత చవక ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్
బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తీసుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా మరో ఆఫర్ తీసుకొచ్చింది. విద్యార్థుల కోసం చవకైన ప్లాన్ ప్రవేశపెట్టింది. నవంబర్ 14న ఈ ప్లాన్ తీసుకురాగా.. డిసెంబర్ 13 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్ధ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరకు రీఛార్జ్, డేటా ప్లాన్స్ అందిస్తోంది. అంతేకాకుండా కస్టమర్ల కోసం అనేక ఆఫర్లు తీసుకొస్తుంది. ఇక పండుగల సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తోంది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు సబ్‌స్కైబర్లు కూడా పెరుగుతున్నారు. ప్రైవేట్ సంస్థలు అందించే రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీంతో బీఎస్ఎన్‌ఎల్ వైపు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ఇండియాలో 5జీని కూడా లాంచ్ చేసింది. దీంతో బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
స్టూడెంట్స్ కోసం ప్రత్యేక ప్లాన్
కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్న బీఎస్ఎన్‌ఎల్ ఇటీవల నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర రూ. 251 కాగా.. దీని వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. 100 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు ఆన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సదుపాయం ఉంది. 14 నవంబర్ నుంచి 13 డిసెంబర్ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో రీఛార్జ్ చేసుకుని ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్యాక్‌లో కేవలం 4జీ నెట్వర్క్ మాత్రమే వస్తుంది. ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అయ్యేవారు, రీసెర్చ్ చేసేవారు, ప్రాజెక్ట్ ఆధారిత కార్యకలాపాల కోసం ఈ ప్లాన్ విద్యార్థులు ఉపయోగపడుతుందని బీఎస్‌ఎన్ఎల్ ప్రకటించింది.
రోజుకు రూ.9 మాత్రమే
బీఎస్ఎన్‌ఎల్ సెల్ప్ కేర్ యాప్ లేదా సమీపంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక ప్రాంచేజీ లేదా పాయిట్ ఆఫ్ సేల్స్ అవుట్‌లెట్లను సంప్రదించి ఈ రీచార్జ్ చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. రూ.251తో 28 రోజుల వాలిడిటీ అంటే.. రోజుకు రూ.9 మాత్రమే పడుతుంది. కేవలం విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఈ ప్లాన్ తీసుకొచ్చారు.




