ఏసీలు కొనాలనుకునేవారికి భారీ షాక్‌..!!

మార్చి మాసం రానేలేదు కానీ.. అప్పుడే భానుడు ఈ సారి భగభగమంటున్నాడు. దీంతో ఈ వేసవిలో భానుడి నుంచి ఉపశమనం పొందేందుకు సగటు జీవి ఏసీలు కొనేందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఈ సారి ఏసీలు కొనే వారికి షాకింగ్ న్యూస్ తెలిపాయి ఏసీలు అమ్మే కంపెనీలు. అతి త్వరలో ఏసీల ధరలు పెరగనున్నాయట. దీనికి కారణం కూడా కరోనా వైరస్ అని తెలుస్తోంది. ఏసీ తయారు చేసేందుకు కావాల్సిన విడిభాగాలు ఎక్కువగా చైనా నుంచే రావాల్సి […]

ఏసీలు కొనాలనుకునేవారికి భారీ షాక్‌..!!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 24, 2020 | 6:40 AM

మార్చి మాసం రానేలేదు కానీ.. అప్పుడే భానుడు ఈ సారి భగభగమంటున్నాడు. దీంతో ఈ వేసవిలో భానుడి నుంచి ఉపశమనం పొందేందుకు సగటు జీవి ఏసీలు కొనేందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఈ సారి ఏసీలు కొనే వారికి షాకింగ్ న్యూస్ తెలిపాయి ఏసీలు అమ్మే కంపెనీలు. అతి త్వరలో ఏసీల ధరలు పెరగనున్నాయట. దీనికి కారణం కూడా కరోనా వైరస్ అని తెలుస్తోంది.

ఏసీ తయారు చేసేందుకు కావాల్సిన విడిభాగాలు ఎక్కువగా చైనా నుంచే రావాల్సి ఉంటుంది.అయితే కరోనా ఎఫెక్ట్‌తో విడి భాగాల దిగుమతి భారం కానుంది. అటు బడ్జెట్‌లో కూడా వీటిపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచడం ధరలు పెరిగేందుకు ముఖ్యకారణం. దీంతో దాదాపు 5 శాతం మేర ఏసీల ధరలు పెంచాలని ఆయా కంపెనీలు నిర్ణయించాయి.

ముఖ్యంగా ఏసీల తయారీకి కావాల్సిన కంట్రోలర్స్‌, కంప్రెషర్స్‌, ఇతర విడిభాగాలు చైనా, థాయ్‌లాండ్‌, మలేసియా నుంచి షిప్పుల్లో దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ఈసారి ఈ పరికరాలను ప్రత్యేక విమానాల్లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తయారీ వ్యయం కూడా పెరగనుంది.