నెలకు పది వేల రూపాయల పొదుపుతో.. చక్కని పెన్షన్.. ఇలా చేస్తే భవిష్యత్తు భద్రం!

NPS Investment: చాలామంది ఉద్యోగులు కొన్ని తప్పులు చేస్తారు. అందులో ఒకటి రిటైర్మెంట్‌ తర్వాత జీవితం గురించి ఆలోచించకపోవడం. దీంతో చివరి వయసులో చాలా ఆర్థిక సమస్యలని

నెలకు పది వేల రూపాయల పొదుపుతో.. చక్కని పెన్షన్.. ఇలా చేస్తే భవిష్యత్తు భద్రం!
Money
Follow us

| Edited By: Srinivas Chekkilla

Updated on: Mar 20, 2022 | 8:58 AM

NPS Investment: చాలామంది ఉద్యోగులు కొన్ని తప్పులు చేస్తారు. అందులో ఒకటి రిటైర్మెంట్‌ తర్వాత జీవితం గురించి ఆలోచించకపోవడం. దీంతో చివరి వయసులో చాలా ఆర్థిక సమస్యలని ఎదుర్కొంటారు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. అందుకే ఉద్యోగం చేస్తున్నప్పుడు రిటైర్మెంట్‌ ప్లాన్‌ చేయాలి. అందుకోసం ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. జాతీయ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్‌ తర్వాత ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. నిజానికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ప్రభుత్వ పథకం. దీని కింద పెట్టుబడిదారుడి సగటు వయస్సు 21 సంవత్సరాలు. ఈ పథకం సీనియర్ సిటిజన్లకి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పొదుపు చేసిన మొత్తం నుంచి గ‌రిష్ఠంగా 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌డంతో పాటు క‌నీసం 40 శాతం నిధుల‌తో యాన్యూటీల‌ను కొనుగోలు చేయాలి. కాబ‌ట్టి నెల‌నెలా పెన్షన్ పొందేందుకు వీలుంటుంది.

ఎన్‌పీఎస్ ఒకే పెట్టుబ‌డిలో ఈక్వీటీ, డెట్ రెండింటినీ అందిస్తుంది. ఖాతాదారుడు ఎంచుకున్న డెట్‌, ఈక్వీటీ నిష్పత్తిని బ‌ట్టి రాబ‌డి ఉంటుంది. కాబ‌ట్టి ఇందులో రాబ‌డి స్థిరంగా ఉండ‌దు. మ‌దుప‌ర్లు 75 శాతం వ‌ర‌కు ఈక్వీటీల‌లో మ‌దుపు చేసేందుకు ఎన్‌పీఎస్ వీలు క‌ల్పిస్తుంది. అయితే ఈక్వీటీ, డెట్‌ల నిష్పత్తి 60:40గా ఉంటే మంచిద‌నేది నిపుణుల సూచ‌న‌. ఎందుకంటే ఎన్‌పీఎస్ ఖాతాదారుడు మెచ్యూరిటీ స‌మ‌యంలో 40 శాతం నిధుల‌ను యాన్యూటీ కోసం త‌ప్పక కేటాయించాల్సి ఉంటుంది.

ఎన్‌పీఎస్ రాబ‌డి లెక్కింపు

పెట్టుబ‌డిదారుడు ఈక్వీటీలో 60 శాతం, డెట్‌లో 40 శాతం నిధులు ఉంచితే.. ఈక్వీటీ నుంచి 12 శాతం, డెట్ నుంచి 8 శాతం రాబ‌డి పొందే అవ‌కాశం ఉంది. మొత్తం రాబ‌డిని లెక్కిస్తే ఎన్‌పీఎస్ ఖాతాదారుడు ఈక్వీటీల‌లో 60 శాతం నిధుల‌ను మ‌దుపు చేస్తే.. రాబ‌డి అంచ‌నా 12 శాతం అనుకుంటే.. 60 శాతం నిధుల నుంచి వ‌చ్చే రాబ‌డి 12 x 0.60 = 7.20 శాతం అలాగే డెట్‌లో 40 శాతం నిధుల‌ను మ‌దుపు చేస్తే.. రాబ‌డి అంచ‌నా 8 శాతం అనుకుంటే.. 40శాతం నిధుల నుంచి వ‌చ్చే రాబ‌డి 8 x 0.40 = 3.20 శాతం, మొత్తం రాబ‌డి 7.20+3.20 = 10.40 అంటే దాదాపు 10 శాతం రాబ‌డి ఉంటుంది.

పెట్టుబ‌డిదారుడు 60:40 నిష్పత్తి ప్రకారం ఈక్విటీ, డెట్‌లో నెల‌కు రూ.10 వేలు పెట్టుబ‌డి పెడుతూ 30 సంవ‌త్సరాలు పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తే.. మెచ్యూరిటీ మొత్తంలో 40 శాతం యాన్యుటీ కొనుగోలు చేయాలి కాబ‌ట్టి మిగిలిన 60 శాతం అంటే రూ. 1,36,75,952 విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అలాగే నెల‌వారీగా రూ. 45,587 పెన్షన్ పొంద‌చ్చు. దీనికి తోడు విత్‌డ్రా చేసుకున్న మొత్తాన్ని కూడా తిరిగి పెట్టుబ‌డి పెడితే దాదాపు రూ. 1.50 ల‌క్షల నెల‌వారీ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.

నెలకి రూ.1.5 ల‌క్షలు..

ఎన్‌పీఎస్ ఖాతాదారుడు మెచ్యూరిటీ స‌మ‌యంలో విత్‌డ్రా చేసుకున్న మొత్తాన్ని SWP(Systematic Withdrawal Plan)లో పొదుపు చేస్తే పెట్టుబ‌డిదారుడు క‌నీసం 8 శాతం వార్షిక రాబ‌డిని పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎన్‌పీఎస్ నుంచి విత్‌డ్రా చేసుకున్న రూ.1.36 కోట్లను ఎస్‌డ‌బ్ల్యూపీలో 25 సంవ‌త్సరాలు పొదుపు చేస్తే త‌ర్వాతి 25 ఏళ్లు నెల‌కు రూ. 1.03 లక్షల చొప్పున ఆదాయం పొంద‌చ్చు. దీనికి ఎన్‌పీఎస్ నుంచి వ‌చ్చే పెన్షన్‌ను జోడిస్తే నెల‌కు దాదాపు రూ.1.50 ల‌క్షలు (రూ.1.03 ల‌క్షలు+ రూ. 45,587) నెల‌వారీ ఆదాయం పొంద‌చ్చు. కానీ దీనికి నిర్ది్ష్ట ప్రణాళిక కచ్చితంగా అవసరమని గుర్తుంచుకోండి.

Virat Kohli: విరాట్‌ కోహ్లీపై సినిమా తీస్తే టైటిల్‌ ఏంటో తెలుసా..!

Telangana: నిరుద్యోగులకి తీపి కబురు.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..

Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..