Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

Business Ideas: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా ఫుడ్డు, ట్రెయినింగ్, లోన్

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు, ట్రైనింగ్‌తో పాటు.. వ్యాపారానికి లోన్ కూడా..
Business Ideas: SBI has helped lakhs of people, Business Ideas: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా ఫుడ్డు, ట్రెయినింగ్, లోన్

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు, ట్రైనింగ్‌తో పాటు.. వ్యాపారానికి లోన్ కూడా.. ఇస్తుంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. నిరుపేదలు, నిరుద్యోగులు, ఉన్నత విద్యను అభ్యసించలేని వారికి బాసటగా నిలుస్తూ ఈ శిక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చింది ఎస్‌బీఐ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి.. యువతకు తోడ్పాటుగా నిలుస్తోంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా 587 శిక్షణా సంస్థలను ప్రారంభించింది. ఇప్పుడు మరో 151 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణలు ప్రారంభించనుంది. ఉపాధి లేక బాధపడుతోన్న యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది ఎస్‌బీఐ. ఉచిత శిక్షణే కాకుండా ఫ్రీగా భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నది. ఎన్నో డబ్బులు పోగేసి నేర్చుకునే కోర్సులను ఉచితంగా అందిస్తుండటంతో యువతీ, యువకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్రైనింగ్ తర్వాత వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం అవకాశాలు కూడా కల్పిస్తోంది ఎస్‌బీఐ సంస్థ.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆయా జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో దరఖాస్తు చేసుకోవాలి. స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్‌ని కలిసి శిక్షణ సంస్థ వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ శిక్షణ పొందేందుకు అర్హతలేంటంటే.. 18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. కనీసం 10వ తరగతైనా పాస్ అయి ఉండాలి. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డ్, 3 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు కావాలి.

కోర్సుల వివరాలు:

కంప్యూటర్ హార్డ్ వేర్, నెట్ వర్కింగ్, వ్యవసాయ అనుబంధ వృత్తులు, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఎలక్ట్రికల్ మోటార్ రివైండింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎంబ్రాయిడరీ, కొవ్వొత్తులు, అగరుబత్తుల తయరీ, టూవీలర్ మెకానిజం, సెల్ ఫోన్ రిపేరింగ్ స్కిల్స్, పచ్చళ్లు, మసాలా పౌడర్ల తయరీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

Business Ideas: SBI has helped lakhs of people, Business Ideas: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా ఫుడ్డు, ట్రెయినింగ్, లోన్

Related Tags