Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

ప్రయాణికులతో సహా ఆర్టీసీ బస్సు దొంగతనం..చివరకు ఏం చేశాడంటే..!

Bus theft from bus stop inTelangana, ప్రయాణికులతో సహా ఆర్టీసీ బస్సు దొంగతనం..చివరకు ఏం చేశాడంటే..!

ఓ వ్యక్తికి ఏదైనా పెద్ద దొంగతనం చేయాలనిపించింది. అలా ఆలోచిస్తున్నంతలోనే ఎదురుగా బస్టాప్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు కనిపించింది. అంతే వెనుకా, ముందు ఆలోచించకుండా డ్రైవర్ సీట్లో కూర్చొని ఆ బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. తీరా మార్గమధ్యంలో వెళ్లాక లారీని ఢీకొట్టి, ఆ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. అయితే ఆ సమయంలో ఆ బస్సులో ప్రయాణికులు కూడా ఉండటం కొసమెరుపు. చదివేందుకు కాస్త ఆసక్తిని పుట్టిస్తోన్న ఈ సంఘటన ఎక్కడో కాదు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. తాండూరు డిపోకు చెందిన ఓ బస్సు ఆదివారం రాత్రి కరణ్‌కోట్ నైట్‌హోల్డ్ బయల్దేరడానికి బస్టాప్‌లో నిలిపి ఉంది. డ్రైవర్, కండక్టర్ భోజనానికి వెళ్లారు. అప్పటికే ప్రయాణికులు బస్సులో ఎక్కి కూర్చున్నారు. అంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బస్సును స్టార్ట్ చేశాడు. కండక్టర్ రాకుండానే బస్సును ఎలా స్టార్ట్ చేస్తావని ప్రయాణికులు ప్రశ్నించగా.. దీనికి నేనే డ్రైవర్, నేనే కండక్టర్ అంటూ మాట్లాడి.. బస్టాప్ నుంచి రయ్‌మంటూ తీసుకెళ్లాడు. ఆ తరువాత మల్లప్పమడిగ దగ్గరకు వెళ్లగానే ఓ లారీని ఢీకొట్టాడు. ఇక ఆ భయంతో నడిరోడ్డు మీదే బస్సును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఈ సంఘటన నుంచి కాస్త తేరుకున్న ప్రయాణికులు డిపో మేనజర్‌కు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత బస్సును తిరిగి డిపోకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే మద్యంలో ఉండటం వల్లనే ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ తెలంగాణలో ఓ ఆర్టీసీ బస్సును అపహరించిన దుండగులు.. అందులో ప్రధాన భాగాలన్నీ తీసుకొని వేరే ప్రదేశంలో వదిలేసిన విషయం తెలిసిందే.

Related Tags