మహిళ కండక్టర్‌కు కరోనా !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా భయాందోళనలు రేకెత్తిస్తోంది. పెరుగుతున్న వైరస్ అనుమానితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 11 కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదైనట్లు సమాచారం. నిన్న ఒక్కరోజే 5 అనుమానిత కేసులు నమోదుకావటం మరింత భయాన్ని కలిగిస్తోంది. తాజాగా ఓ బస్‌ కండక్టర్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

మహిళ కండక్టర్‌కు కరోనా !
Follow us

|

Updated on: Mar 05, 2020 | 1:28 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా భయాందోళనలు రేకెత్తిస్తోంది. పెరుగుతున్న వైరస్ అనుమానితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 11 కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదైనట్లు సమాచారం. నిన్న ఒక్కరోజే 5 అనుమానిత కేసులు నమోదుకావటం మరింత భయాన్ని కలిగిస్తోంది. తాజాగా ఓ బస్‌ కండక్టర్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలోనూ కరోనా వైరస్ కలకలం రేపుతోంది.

తెలంగాణ నుంచి ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్‌కు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడం కలకలం రేపింది. తెలంగాణ నుంచి ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్‌కు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులోని ప్రయాణికులు, బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. చింతలపూడిలో బస్సును నిలిపేశారు. వెంటనే మహిళా కండక్టర్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్యులు పరీక్షలు చేపట్టారు. జలుబు, దగ్గు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో… ముందు జాగ్రత్తగానే ఆమె వైద్యులను సంప్రదించినట్టు తెలుస్తోంది.

ఇక ఏపీలో ఇప్పటివరకు అనేక మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎవరికీ కరోనా సోకినట్టు నిర్థారణ కాలేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యులు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే… అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.