Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 7 లక్షల 42 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా 22, 752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 482 మంది మృతి • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,64,944 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,56,830 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 20,642 గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,62,679 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఇప్పటి వరకు దేశంలో 1,04,73,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • కరీంనగర్ జిల్లా ఆరవ విడత హరితహారంలో భాగంగా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్..
  • అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కరోనా నేపథ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు. 13 ప్రత్యేక జైళ్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం. స్పెషల్‌ జైలుకు తరలించే విధంగా ఆదేశాలు. కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ పాటించనున్న సబ్‌జైళ్లు. కరోనా నెగెటివ్‌ ఖైదీని మాత్రమే సాధారణ జైలుకు తరలించేలా ఆదేశాలు. జైలు సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు.
  • జివికే గ్రూప్ ఫై ఈడి కేసు నమోదు . ముంబాయి ఎయిర్ పోర్ట్ అభివృధి పేరుతో 705 కోట్ల రూపాయల కుంభకోణం కు పాల్పడిన జీవీకే సంస్థ. మనీలాండరింగ్ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు . జి వి కృష్ణారెడ్డి, సంజీయిరెడ్డి లతో పాటు నిందితులకు ఈడీ నోటీసులు . 305 కోట్ల రూపాయల బదలాయియింపుల ఫై ఈడీ ఆరా . విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానాలు . జూన్ 27 న జీవీకే సంస్థ తో పాటు 13 మంది పై సీబీఐ కేసు నమోదు . గత వారంలో హైదరాబాద్ ,ముంబై లో నీ జీవీకే కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ.
  • పంచాయతీరాజ్ ఎల్ ఈ డీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ పేరు మార్పు. ప్రాజెక్టుకు "జగనన్న పల్లె వెలుగు" గా పేరు మార్చిన ప్రభుత్వం . ఆదేశాలు జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ . ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కు ఆదేశం.
  • తెలంగాణ లో 27వేల మార్కు దాటిన కరోనా కేసులు. హైదరాబాద్ లో 20వేలకు చేరవలో కేసులు. రాష్ట్రంలో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 1879. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 27612. జిహెచ్ఎంసి పరిధిలో -1422. Ghmc లో 12,633 కు చేరుకున్న కేసులు. ఈరోజు కరోనా తో 7 మృతి . 313కి చేరిన మరణాలు. చికిత్స పొందుతున్న వారు- 11,012. డిశ్చార్జి అయిన వారు -16287. ఈ రోజు వరకూ రాష్ట్రంలో టెస్టింగ్స్ 128438.
  • రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు. భారీ బందోబస్తు మధ్య పనులు.. దారులన్నీ మూసివేత. ఇప్పటికే సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు పాత భవనాలు నేలమట్టం. సమాంతరంగా ఇతర బ్లాకుల్లో కూల్చివేత పనులు. మరో మూడు రోజుల్లో కూల్చివేత పూర్తి. శిథిలాల తొలగింపునకు కొన్ని వారాలు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూట్ మ్యాప్ ఖరారు. వారం పాటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.

డివిలియర్స్ మెరుపులు వృధా.. బెంగళూరు పై ముంబై విజయం

Bumrah shines as MI pip RCB amidst no-ball controversy, డివిలియర్స్ మెరుపులు వృధా.. బెంగళూరు పై ముంబై విజయం

బెంగళూరు: ఐపీఎల్ 12వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి విజయం నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్ఠానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(48; 33 బంతుల్లో), సూర్యకుమార్ యాదవ్(38; 24 బంతుల్లో), హార్దిక్ పాండ్య(32; 14 బంతుల్లో) రాణించారు. కాగా చాహల్ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, ఉమేష్ లు చెరో 2 వికెట్లు తీశారు.

Bumrah shines as MI pip RCB amidst no-ball controversy, డివిలియర్స్ మెరుపులు వృధా.. బెంగళూరు పై ముంబై విజయం

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు వికెట్ కీపర్ పార్థివ్ పటేల్(31; 22 బంతుల్లో) మంచి ఆరంభాన్ని అందించాడు. ఇక కొద్దిసేపటికే ఓపెనర్లు పెవిలియన్ చేరడంతో ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(48; 32 బంతుల్లో), ఏబీ డివిలియర్స్(70 నాటౌట్; 41 బంతుల్లో) వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డు ముందుకు కదిలించారు. అయితే కోహ్లీని బుమ్రా ఔట్ చేయడంతో బెంగుళూరుకు గట్టి దెబ్బ తగిలింది. విరాట్ ఔటైనా.. ఏబీ మాత్రం తనదైన శైలిలో షాట్స్ కొడుతూ ముంబై బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. అయితే చివరి ఓవర్లలో ముంబై బౌలర్లు పరుగులు ఇవ్వకుండా ఆర్సీబీ ని కట్టడి చేయడంతో పరాభవం తప్పలేదు. ముంబై బౌలర్లలో బుమ్రా(3/20), మార్కండే (1/23) చక్కని బౌలింగ్ చేశారు. ఇక ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related Tags