‘ఆ సొమ్ము మాకొద్దు’..చచ్చిపోతానంటున్న కుర్రాడి బంధువు ప్రకటన

తాను మరుగుజ్జునన్నకారణంగా స్కూల్లోని పిల్లంతా హేళన చేస్తూ వేధిస్తున్నారని అది భరించలేక చచ్చిపోవాలనుకుంటున్నానని ఏడుస్తూ చెప్పిన ఆస్ట్రేలియాలోని తొమ్మిదేళ్ల కుర్రాడు క్వాడెన్ బేల్స్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.

'ఆ సొమ్ము మాకొద్దు'..చచ్చిపోతానంటున్న కుర్రాడి బంధువు ప్రకటన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 27, 2020 | 6:25 PM

తాను మరుగుజ్జునన్నకారణంగా స్కూల్లోని పిల్లంతా హేళన చేస్తూ వేధిస్తున్నారని అది భరించలేక చచ్చిపోవాలనుకుంటున్నానని ఏడుస్తూ చెప్పిన ఆస్ట్రేలియాలోని తొమ్మిదేళ్ల కుర్రాడు క్వాడెన్ బేల్స్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఈ బాలుడి వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇతనికి సపోర్టుగా కమెడియన్ బ్రాడ్ విలియమ్స్.. ‘గో ఫండ్ మీ’ పేజ్ ని స్టార్ట్ చేయగా.. 4లక్షల 75 వేల యుఎస్ డాలర్లు వెల్లువలా వఛ్చి పడ్డాయి. ఇతడి మానసిక సాంత్వన కోసం ఇతడిని డిస్నీ లాండ్ కి కూడా తీసుకువెళ్తామని అనేకమంది ఆఫర్లు ప్రకటించారు. ఈ వీడియోను చూసిన లక్షలాది మంది ఇతనికి అండగా ఉంటామని హామీ ఇచ్చ్చారు. అయితే ఈ విరాళాలు బేల్స్ కి, అతని తల్లికి అందనుండగా.. వీరి కుటుంబంలోని దగ్గరి బంధువైన ఓ మహిళ మాత్రం.. ఈ సొమ్ము తమకు వద్దని, దీన్ని ఏ చారిటీకైనా ఇచ్ఛేయాలని కోరుతోంది. క్వాడెన్ అనుభవిస్తున్న మానసిక క్షోభ.. డిస్నీ లాండ్ విజిట్ చేస్తే పోతుందా అని ఆమె ప్రశ్నించింది. వేధింపుల కారణంగా సమాజంలో తెలుపు, నలుపు వ్యక్తులనే వివక్ష కొనసాగుతోందని, అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొంది. తమకు ఈ విరాళాలు ఇచ్ఛే బదులు ఏ ధార్మిక సంస్థకైనా ఇస్తే ఆ సంస్థ ప్రయోజనాలు నెరవేరుతాయని ఆమె అభిప్రాయపడింది.