బులెట్ ట్రైన్ ప్రాజెక్టు, ఏడు ఇండియన్ కంపెనీల ‘ముందడుగు’

అహమ్మదాబాద్-ముంబై మధ్య బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఓ ముందడుగు ! ఈ ప్రాజెక్టును చేబట్టిన నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్..టెండర్లను ఓపెన్ చేయగా.. ఏడు భారతీయ కంపెనీలు తమ బిడ్లను సమర్పించాయి.

బులెట్ ట్రైన్ ప్రాజెక్టు, ఏడు ఇండియన్ కంపెనీల 'ముందడుగు'
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 24, 2020 | 2:30 PM

అహమ్మదాబాద్-ముంబై మధ్య బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఓ ముందడుగు ! ఈ ప్రాజెక్టును చేబట్టిన నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్..టెండర్లను ఓపెన్ చేయగా.. ఏడు భారతీయ కంపెనీలు తమ బిడ్లను సమర్పించాయి. సుమారు 20 వేలకోట్ల పెట్టుబడితో దీన్ని చేపడుతున్నారు. 237 కి.మీ. ఈ మెయిన్ లైన్ ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసిన కంపెనీల్లో లార్సెన్ అండ్ టూబ్రో, అఫ్ కాన్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, జెఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా, ఎన్సీసి టాటా ప్రాజెక్ట్ జె-కుమార్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ ఉన్నాయి.

237 కి.మీ. ఈ కారిడార్  పరిధిలో 24 నదులు, 30 రోడ్ క్రాసింగులు ఉన్నట్టు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు.