Breaking News
  • కర్నూలు: ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్‌. పగుళ్లు వచ్చి డ్యామ్‌ ప్రమాదంలో ఉందని రాజేంద్రసింగ్‌ హెచ్చరిక. పగుళ్లతో వాటర్‌ లీకేజీలు ఎక్కువగా ఉన్నాయన్న రాజేంద్రసింగ్‌. గంగాజల్‌ సాక్షరత యాత్రలో భాగంగా శ్రీశైలం డ్యామ్‌ పరిశీలన. ప్రధాన డ్యామ్‌ ఎదురుగా భారీ గొయ్యి ఏర్పడింది. డ్యామ్‌ గేట్లు ఎత్తిన ప్రతీసారి మరింత పెద్దదవుతుంది. ఆ గొయ్యి విస్తరిస్తూ డ్యామ్‌ పునాదుల వరకు వెళ్తోంది. చాలా కాలం నుంచి లీకేజీలు వస్తున్నా పట్టించుకోలేదు. డ్యామ్‌ నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదంగా మారింది.
  • శ్రీశైలం డ్యామ్‌కు పగుళ్లు వాస్తవమేనంటున్న అధికారులు. పరిస్థితిపై ప్రభుత్వానికి వివరించాం. డ్యామ్‌ కొట్టుకుపోయేంత ముప్పులేదంటున్న అధికారులు.
  • కాకినాడ: వైద్యం వికటించి యువకుడి పరిస్థితి విషమం. కడుపు నొప్పి రావడంతో ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చేరిన యువకుడు. మూడు రకాల ఇంజెక్షన్‌లు చేసిన ఆస్పత్రి వైద్యులు. యువకుడి పరిస్థితి విషమించడంతో ట్రస్ట్‌ ఆస్పత్రికి తరలింపు.
  • కొలిక్కి రాని మహారాష్ట్ర పంచాయితీ. ముంబైలో నేడు వేర్వేరుగా కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతల సమావేశం.
  • కొమురంభీంఆసిఫాబాద్‌: కాగజ్‌నగర్‌లో దారుణం. తల్లి సంధ్య గొంతు కోసిన కొడుకు. తల్లి పరిస్థితి విషమం, మంచిర్యాల ఆస్పత్రికి తరలింపు. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న సంధ్య.
  • ప్రకాశం: అద్దంకిలో రెండు ఇళ్లలో చోరీ. 7 సవర్ల బంగారం, రూ.10వేల నగదు, 2 సెల్‌ఫోన్లు అపహరణ.
  • నేడు జనగామ, మహబూబాద్‌ జిల్లాల్లో మంత్రి ఎర్రబెల్లి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు.
  • చిత్తూరు: రామకుప్పం మండలం ననియాలతండాలో దారుణం. వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి రవి అనే వ్యక్తి మృతి. రవి మృతదేహాన్ని రహస్యంగా కాల్చివేసిన వేటగాళ్లు. రవిని హత్య చేశారంటున్న ననియాల గ్రామస్తులు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ననియాల, ననియాలతండా గ్రామాలలో ఉద్రిక్తత.

బుల్లెట్ కాస్ట్.. బాప్‌రే ఇంత చీపా..? రూ.25వేలకే..

Bullet at very Low Cost, బుల్లెట్ కాస్ట్.. బాప్‌రే ఇంత చీపా..? రూ.25వేలకే..

కడప జిల్లా నందలూరులో ఇప్పుడు ఎక్కడ చూసినా యువకులు బుల్లెట్‌ వెహికిల్‌తో దూసుకుపోతున్నారు. దాదాపు లక్షన్నర వరకు ఖరీదు చేస్తున్నఈ వాహనాలను ఇక్కడ మాత్రం అత్యంత చౌకగా లభ్యం కావడంతో అందరూ వాటినే కొనుగోలు చేస్తున్నారు. ఇంతకీ అంతటి కాస్లీ వెహికిల్‌ ఇక్కడ మాత్రం ఎందుకంత చౌకగా లభిస్తుందనుకుంటున్నారా..? ఇక్కడే అసలు మర్మం దాగివుంది. కర్నాటక నుంచి కడప జిల్లాలోని నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్‌, పల్సర్‌ లాంటి బైకులు భారీగా దిగుమతి చేస్తోంది ఓ ముఠా..ఆ గ్యాంగ్‌ తీసుకువచ్చిన బైక్‌లను అతి తక్కువ ధరకు ..రూ. 25 వేల నుండి 50 వేల లోపుగానే అమాయకులకు అట్టగడుతున్నారు. ఖరీదైన వాహనాలు…కారు చౌకగా వస్తుండటంతో యువత ఎగబడి కొన్నారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పక్క రాష్ట్రం నుంచి బుల్లెట్‌ వాహనాలను అక్రమంగా తరలించి ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నట్లుగా పోలీసులు తేల్చారు. బుల్లెట్‌ వాహనాలను స్వాధీనం చేసుకున్ననందలూరు పోలీసులు..వీటి తరలింపు వెనక అసలు సూత్రదారి ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు