పరుగులెత్తించి.. హడలెత్తించి.. బుల్ రన్.. రన్

Animal was released into bullring and jumped over wall separating spectators, పరుగులెత్తించి.. హడలెత్తించి.. బుల్ రన్.. రన్

స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ వరల్డ్ ఫేమస్. మదగజాల్లా ఉన్న బుల్స్ తో ఫైటర్లు చేసే ‘ యుధ్ధాలను ‘ చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. భీకరమైన ఆ ఫైట్స్ లో ఒక్కోసారి ఫైటర్లు తీవ్రంగా గాయపడడమో, ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంటుంది. తాజాగా అక్కడి కెపారోసో అనే పట్టణంలో జరిగిన ఓ ఘటన చూస్తే ఒళ్ళు జలదరించక తప్పదు. కళ్ళు తిప్పలేం కూడా. ఈ టౌన్ లో బుల్ ఫెస్టివల్ సందర్భంగా రింగ్ లోకి మదించిన ఎద్దును నిర్వాహకులు వదిలారు. అయితే ఆ రింగ్ లో అప్పటికి ఫైటర్లు ఇంకా చేరుకోలేదు. ఈ బుల్ ఎందుకో ఒక్కసారిగా రెచ్చిపోయింది. పరుగులు పెడుతూ.. జనాల్లోకి దూసుకుపోయింది. రింగ్ కి, ప్రజలకు మధ్య ఉన్న ప్రొటెక్టివ్ వాల్ డివైడర్ ని ఎక్కేసి అవతల పడిపోయింది. దీంతో జనమంతా భయంతో హాహాకారాలు చేస్తూ తలో దిక్కూ పరుగు పెట్టారు. ఈ తొక్కిసలాటలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. కింద పడిపోయిన బుల్ మళ్ళీ లేచి వీధులవెంట పడింది. చివరకు అతి కష్టం మీద దాన్ని ఓ నది వద్ద పోలీసులు, స్థానికులు పట్టుకుని అదుపు చేయగలిగారు. అప్పటికి అది శాంతించినట్టుంది. ఓ ట్రక్కులో దాన్ని ఎక్కించి తిరిగి యథాస్థానానికి చేర్చారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *