ఆ ఎద్దు పేడలో బంగారం..ఏంటా మిస్టరీ..?

మనం చేసే కొన్ని పొరపాట్లు ఊహించని ఎక్స్‌పీరియన్స్‌ను మిగులుస్తాయి. అలానే ఇప్పుడు హర్యానాలో ఓ ఫ్యామిలీ ఎద్దు పేడ ఎప్పుడు వేస్తుందా అని ఎదురుచూస్తోంది. అది పేడ వేసినప్పుడల్లా పరీక్షగా అందులో బంగారం కోసం వెతుకుతోంది. మాములుగా పేడ లక్ష్మీదేవికి సంకేతం. ఇప్పుడు ఆ ఇంట్లో పేడ కూడా వారికి నిజమైన లక్ష్మీదేవిగా మారింది. ఎందుకు అంటారా అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే… హర్యానాలోని సిర్సాలో జనక్‌రాజ్ అతని కుటుంబంతో కలిసి నివశిస్తున్నారు. అతని భార్య కోడల్లు […]

ఆ ఎద్దు పేడలో బంగారం..ఏంటా మిస్టరీ..?
Follow us

|

Updated on: Oct 30, 2019 | 2:36 PM

మనం చేసే కొన్ని పొరపాట్లు ఊహించని ఎక్స్‌పీరియన్స్‌ను మిగులుస్తాయి. అలానే ఇప్పుడు హర్యానాలో ఓ ఫ్యామిలీ ఎద్దు పేడ ఎప్పుడు వేస్తుందా అని ఎదురుచూస్తోంది. అది పేడ వేసినప్పుడల్లా పరీక్షగా అందులో బంగారం కోసం వెతుకుతోంది. మాములుగా పేడ లక్ష్మీదేవికి సంకేతం. ఇప్పుడు ఆ ఇంట్లో పేడ కూడా వారికి నిజమైన లక్ష్మీదేవిగా మారింది. ఎందుకు అంటారా అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే…

హర్యానాలోని సిర్సాలో జనక్‌రాజ్ అతని కుటుంబంతో కలిసి నివశిస్తున్నారు. అతని భార్య కోడల్లు ఎప్పటిలాగే వంట చేసేందుకు సిద్దమయ్యారు. కాయకూరల చిక్కు తీసి వాటిని పక్కనే ఉన్న ఓ పాత్రలో వేశారు. అయితే అంతకుముందే వారి ఇంట్లో ఉన్న 4 తులాల బంగారాన్ని కూడా శుభ్రంచేసే నిమిత్తం అదే పాత్రలో గుడ్డచుట్టి పెట్టిన విషమం మర్చిపోయారు. ఇక ఆ కాయకూరల వ్యర్థాలతో పాటు బంగారాన్ని కూడా తీసుకెళ్లి దగ్గర్లో ఉన్న చెత్తబుట్టలో వేశారు. అక్కడికి వచ్చిన ఎద్దు యదామాములుగానే ఆ వ్యర్థాలతో పాటు బంగారాన్ని కూడా తినేసింది.  ఈ ఘటన అక్టోబర్ 19 న జరిగింది.

తీరా తేరుకున్న కుటంబం ఎట్టకేలకు ఊరంతా తిరిగి ఎద్దును పట్టుకున్నారు. పశువుల డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు దాన్ని ఇంట్లోని కట్టేసి మేపుతున్నారు. పేడ వేసినప్పుడల్లా అందులో తమ బంగారం వస్తుందేమో అని ఆశగా వెతుకుతున్నారు. దాదాపు 2 లక్షల రూపాయల బంగారం ఏం చేస్తారు పాపం. ఆ బంగారం బయటకి వచ్చాక సదరు ఎద్దును గోశాలకు అప్పగిస్తారట. మాములుగా ఆయితే రోడ్లపై తిరిగే ఆవులు ఆకలితో ప్లాస్టిక్‌ను కూడా తినేస్తాయి. అవి పేడతో పాటు బయటకు రాకుండా కడుపులోనే పేరుకుపోతాయి. ఆపరేషన్ చేసి లోపల ఉన్న తదితర వ్యర్థాలను అనేక చోట్ల బయటకు తీసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ ఫ్యామిలీ ఎదురుచూపులకు లక్ష్మీదేవి ఎంతమేర కరణిస్తుందో వేచి చూడాలి.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!