రోడ్డుపైకి నీటిని వదిలినందుకు రూ.లక్ష ఫైన్

నిర్లక్ష్యానికి ఫైన్‌తో చెక్ పెట్టారు అధికారులు. రోడ్డుపై నీరు వదిలినందుకు రూ. లక్ష జరిమానా విధించారు. సెల్లార్‌లోకి చేరిన నీటిని మోటార్‌తో సర్వీస్‌ రోడ్డుపైకి వదిలినందుకు వాసవీ జీపీ ట్రెండ్స్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌కు రూ. లక్ష జరిమానా వేశారు...

రోడ్డుపైకి నీటిని వదిలినందుకు రూ.లక్ష ఫైన్
Follow us

|

Updated on: Sep 30, 2020 | 5:56 PM

నిర్లక్ష్యానికి ఫైన్‌తో చెక్ పెట్టారు అధికారులు. రోడ్డుపై నీరు వదిలినందుకు రూ. లక్ష జరిమానా విధించారు. సెల్లార్‌లోకి చేరిన నీటిని మోటార్‌తో సర్వీస్‌ రోడ్డుపైకి వదిలినందుకు వాసవీ జీపీ ట్రెండ్స్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌కు రూ. లక్ష జరిమానా వేశారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఓఆర్‌ఆర్‌ సర్వీ్‌సరోడ్‌లో ఓ బిల్డింగ్‌కు ఈ వడ్డింపు పడింది.

హనుమాన్‌ టెంపుల్‌ సమీపంలోని వాసవీ జీపీ ట్రెండ్స్‌ బిల్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతిసారి నీటిని రోడ్డు మీదకు నిర్లక్ష్యంగా వదులుతోంది. దీంతో వాహనదారులు ఆ ప్రదేశంలో జారిపడుతున్నారు. ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.

గతంలో కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు వచ్చి వాసవీ జీపీ ట్రెండ్స్‌ బిల్డింగ్ మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించారు. అయినా మేనేజ్‌మెంట్‌ పద్ధతి మార్చుకోకుండా నీటిని రోడ్డు మీదకు వదులుతోంది. ఈ విషయాన్ని జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌ దృష్టికి తీసుకువెళ్లి, జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ రవి తెలిపారు.