త్వరలో కొత్త విద్యా విధానం.. సరస్వతీ, సింధూ యూనివర్సిటీల ఏర్పాటు..

త్వరలో కొత్త విద్యా విధానాన్ని తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామన్న నిర్మలా.. విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. విద్యారంగానికి రూ.99,300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. నైపుణ్యాభివృద్ధికి రూ.3000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పిన నిర్మలా.. కొత్తగా సరస్వతి, సింధు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టార్టప్‌లకు పెద్దపీట వేస్తూ.. ప్రోత్సాహన్ని ఇవ్వనున్నామని.. యువ […]

త్వరలో కొత్త విద్యా విధానం.. సరస్వతీ, సింధూ యూనివర్సిటీల ఏర్పాటు..
Follow us

| Edited By:

Updated on: Feb 01, 2020 | 12:27 PM

త్వరలో కొత్త విద్యా విధానాన్ని తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామన్న నిర్మలా.. విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. విద్యారంగానికి రూ.99,300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. నైపుణ్యాభివృద్ధికి రూ.3000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పిన నిర్మలా.. కొత్తగా సరస్వతి, సింధు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టార్టప్‌లకు పెద్దపీట వేస్తూ.. ప్రోత్సాహన్ని ఇవ్వనున్నామని.. యువ పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తెలిపారు. ఇతరులకు ఉపాధి కల్పించేలా యువత ఎదగాలని సూచించారు. పీపీపీ పద్దతిలో అయిదు స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.