మనస్తాపంతో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్నాయత్నం…కారణం ఇదే!

గత వారం పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విషాద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మనస్తాపంతో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్నాయత్నం...కారణం ఇదే!
Follow us

|

Updated on: Jul 16, 2020 | 11:51 AM

గత వారం పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విషాద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సెల్‌ ఫోన్‌ ఇవ్వలేదని, తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో విజయవాడలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థి సూసైడ్‌ అటెమ్ చేశాడు. వివరాల్లోకి వెళితే…

విజయవాడ ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లికి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పెద్ద అవుటపల్లికి చెందిన యువకుడు విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఎక్కువ సమయం స్నేహితులతోనే గడిపేవాడు. స్నేహితులతో కలిసి టైమ్‌పాస్‌ చేస్తూ…రాత్రివేళ ఇంటికి ఆలస్యంగా వస్తుండేవాడు..దీంతో తల్లిదండ్రులు అతన్ని మందలించారు. రాత్రివేళ ఎక్కువ సమయంలో బయటకు వెళ్లొద్దని చెప్పారు.

దీంతో,  మనస్తాపం చెందిన యువకుడు రాత్రి 10 గంల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి తన స్నేహితుడికి ఐ మిస్ యూ అని మెసేజ్ పెట్టాడు. అనుమానం వచ్చిన స్నేహితుడు.. వెంటనే అతడి తల్లిదండ్రులుకి చెప్పారు. అందరూ కలిసి రాత్రంతా గాలించిన ఆచూకీ లభించలేదు. చివరకు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసరపల్లి కాలువ వద్ద రమేష్‌ బైక్‌ని గుర్తించారు. బైక్‌లో తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టినట్లు గుర్తించారు. కేసరపల్లి కాలువలో పోలీసులు గాలింపు చేపట్టారు.