రాజస్థాన్ లో రాష్ట్రపతి పాలన విధించాలి…మాయావతి డిమాండ్

రాజస్థాన్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ బాహాటంగా పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని అతిక్రమించారని, రెండో సారి తమ పార్టీ ఎమ్మెల్యేలను ఛీట్ చేశారని ఆమె..

రాజస్థాన్ లో రాష్ట్రపతి పాలన విధించాలి...మాయావతి డిమాండ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2020 | 5:02 PM

రాజస్థాన్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ బాహాటంగా పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని అతిక్రమించారని, రెండో సారి తమ పార్టీ ఎమ్మెల్యేలను ఛీట్ చేశారని ఆమె ఆరోపించారు. నాడు మా పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరేలా ప్రోత్సహించలేదా అని ఆమె ప్రశ్నించారు. రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా రాష్ట్రంలోని రాజకీయ అస్థిరతను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడడం ద్వారా అశోక్ గెహ్లాట్ రాజ్యాంగ విరుధ్ధ పోకడలకుపోయారని, ఇది నేరమే అవుతుందని మాయావతి మండిపడ్డారు.

అటు-రాజస్థాన్ మాజీ మంత్రి రమేష్ మీనా కూడా అశోక్ గెహ్లాట్ ని దుయ్యబట్టారు. మీ గత ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీ ఎస్పీ ఎమ్మెల్యేలకు ఎంత సొమ్ము ముట్టజెప్పారని ఆయన కూడా ప్రశ్నించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సచిన్ పైలట్ ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడ్డారని, బీజేపీతో చేతులు కలుపుతున్నారని గెహ్లాట్ చేసిన ఆరోపణలను రమేష్ మీనా ప్రస్తావిస్తూ.. మరి మీరు నాడు చేసిందేమిటన్నారు.