గెహ్లట్‌ సర్కార్‌కు మాయావతి బిగ్ షాక్..!

రాజస్థాన్‌ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ గత కొద్ది రోజులుగా పూర్తి బలం ఉందని ప్రకటించిన క్రమంలో.. ఆయనకు బీఎస్పీ చీఫ్ మాయావతి బిగ్ షాక్‌ ఇచ్చారు. ఒకవేళ విశ్వాస..

గెహ్లట్‌ సర్కార్‌కు మాయావతి బిగ్ షాక్..!
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 5:47 AM

రాజస్థాన్‌ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ గత కొద్ది రోజులుగా పూర్తి బలం ఉందని ప్రకటించిన క్రమంలో.. ఆయనకు బీఎస్పీ చీఫ్ మాయావతి బిగ్ షాక్‌ ఇచ్చారు. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే.. బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు గెహ్లాట్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఏవరైనా గెహ్లాట్‌కు మద్దతు ప్రకటిస్తే.. వారి ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తామంటూ బీఎస్పీ ప్రధాన కార్యదర్శి విప్‌ జారీ చేశారు.

అయితే గత ఏడాదిన్నర క్రితమే ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే బీఎస్పీ జాతీయ పార్టీ అని.. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలో మరో పార్టీలో విలీనం కావడం కుదరదని బీఎస్పీ తేల్చిచెప్పింది. మరోవైపు 18 మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌కు మద్దతు తెల్పుతుండటం.. మరోవైపు బీఎస్పీ పరోక్షంగా మద్దతు ఉపసంహరించుకోవడం ద్వారా.. గెహ్లాట్ సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. ఇప్పుడు విశ్వాస పరీక్ష జరిగితే ఏం జరుగుతోందన్న టెన్షన్‌ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది.