జియో ఎఫెక్ట్.. అదనంగా 33జీబీ డేటా ఇవ్వనున్న బీఎస్ఎన్ఎల్

BSNL offering 33GB data daily with latest unlimited broadband plan: Price and other benefits are surprising, జియో ఎఫెక్ట్..  అదనంగా 33జీబీ డేటా ఇవ్వనున్న బీఎస్ఎన్ఎల్

మార్కెట్‌లో జియో దెబ్బతో ప్రైవేట్ బ్రాడ్‌బ్యాండ్‌లకే కాదు.. ప్రభుత్వ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా దిగొస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ప్లాన్‌ టారిఫ్‌లలో మార్పులు తెస్తుంది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌కు చెందిన రూ.1,999 ప్లాన్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఇకపై రోజుకు 33 జీబీ డేటాను అందివ్వనుంది. జియో ఫైబర్ లాంచ్ అయిన నేపథ్యంలో.. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వినియోగదారులు సదరు డేటాను 100 ఎంబీపీఎస్ గరిష్ట ఇంటర్నెట్ స్పీడ్‌తో వినియోగించుకోవచ్చు. అయితే 33జీబీ లిమిట్ అయిపోయిన అనంతరం నెట్ స్పీడ్ 4ఎంబీపీఎస్‌కు పడిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *