బీఎస్ఎన్ఎల్ ఆఫర్.. అమెజాన్ ప్రైమ్ ఫ్రీ

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వాడుతున్న వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అయితే భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.777.. ఆ పైన ప్లాన్‌లను వాడుతున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. భారతీయ ప్రేక్షకుల్లో అమెజాన్ ప్రైమ్‌కు వస్తోన్న స్పందన వలనే తమ వినియోగదారులకు ఈ ప్లాన్ తీసుకొచ్చామని బీఎస్ఎన్ఎల్ డైరక్టర్, సీఈవో వివేక్ బంజల్ చెప్పారు. కాగా ఏడాది […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:00 pm, Wed, 13 February 19

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వాడుతున్న వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అయితే భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.777.. ఆ పైన ప్లాన్‌లను వాడుతున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. భారతీయ ప్రేక్షకుల్లో అమెజాన్ ప్రైమ్‌కు వస్తోన్న స్పందన వలనే తమ వినియోగదారులకు ఈ ప్లాన్ తీసుకొచ్చామని బీఎస్ఎన్ఎల్ డైరక్టర్, సీఈవో వివేక్ బంజల్ చెప్పారు. కాగా ఏడాది పాటు మాత్రమే వినియోగదారులు ప్రైమ్‌ను ఉచితంగా వాడుకోవచ్చు.